Top 10 Heroines: సమంత దూకుడు.. శ్రీలీలకు భారీ షాక్.. త్రిష సర్‌ప్రైజ్!

Top 10 Heroines: దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే నివేదికల్లో ఓర్మాక్స్ మీడియా రిపోర్టు ఒకటి. ఈ సారి విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల ర్యాంకింగ్స్ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ప్రతి నెల మాదిరిగానే మే నెలకు సంబంధించిన 'ఇండియా టాప్-10 మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ 'జాబితాను ఓర్మాక్స్ విడుదల చేసింది. ఈసారి జాబితాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు హీరోయిన్లు తమ స్థానాలను మెరుగుపరుచుకోగా, మరికొందరు ర్యాంకులు కోల్పోయారు. ముఖ్యంగా సమంత మళ్లీ అగ్రస్థానంలో దూసుకెళ్తుండగా, శ్రీలీల టాప్-10లోనే లేకపోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సమంత మళ్లీ టాప్.. అలియా భట్ రెండో స్థానానికి
కొన్ని నెలలుగా ఓర్మాక్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సమంత, ఏప్రిల్ నెలలో ఒక్కస్థానం వెనక్కి వెళ్లి రెండో స్థానంలో నిలిచింది. అయితే మే నెలలో మళ్లీ బలంగా పుంజుకుని నంబర్-1 స్థానాన్ని తిరిగి సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన 'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం, సోషల్ మీడియాలో భారీ చర్చ జరగడం కూడా ఈ ర్యాంక్‌కు ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గత నెల టాప్‌లో ఉన్న అలియా భట్ ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది.

Ormax Top 10 Heroines May 2026 Samantha Reclaims No 1 Sreeleela Drops Out of List

మూడో స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తన స్థానాన్ని అలాగే కొనసాగించింది. గత నెలలోనూ ఆమె మూడో స్థానంలోనే ఉండగా, ఈసారి కూడా అదే స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక నాలుగో స్థానంలో రష్మిక మందన్నా కూడా అలాగే కొనసాగుతోంది. తెలుగు, హిందీ చిత్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉంది రష్మిక. ఈ అమ్మడు ప్రస్తుతం 'మైసా', 'రణబాలి' వంటి సినిమాల్లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో విడుదలైన 'కాక్‌టెయిల్ 2' సినిమాతో కూడా ఆమె వార్తల్లో నిలిచింది. అయినప్పటికీ ర్యాంకులో ఎలాంటి మార్పు రాలేదు.

ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది. ఇటీవల పెద్ద సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం, అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండటం వల్ల ఆమె పాపులారిటీ తగ్గలేదని ఈ ర్యాంక్ సూచిస్తోంది. గత కొన్ని నెలలుగా కాజల్ ఇదే స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సాయిపల్లవి మాత్రం ఒక స్థానం కోల్పోయింది. ఏప్రిల్‌లో ఆరో స్థానంలో ఉన్న ఆమె, ఈసారి ఏడో స్థానానికి పడిపోయింది. అయితే త్వరలో విడుదల కానున్న భారీ ప్రాజెక్టులతో ఆమె మళ్లీ టాప్-5లోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నయనతార దూకుడు
లేడీ సూపర్ స్టార్ నయనతార ఈసారి మంచి జోరు చూపించింది. ఏప్రిల్‌లో ఏడో స్థానంలో ఉన్న ఆమె, మే నెలలో ఆరో స్థానానికి ఎగబాకింది. సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ కృతి సనన్ కూడా ఒక స్థానం మెరుగుపడి తొమ్మిదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

శ్రీలీలకు ఊహించని షాక్
ఈ జాబితాలో షాకింగ్ విషయమేమిటంటే.. శ్రీలీల టాప్-10 నుంచి పూర్తిగా బయటపడటం. గత నెలలో ఎనిమిదో స్థానంలో ఉన్న శ్రీలీల, ఈసారి టాప్-10లోనే లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పాపులారిటీ ర్యాంకింగ్‌లో ఆమె వెనుకబడటం చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో సీనియర్ హీరోయిన్ త్రిష ఒక స్థానం మెరుగుపడి తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈసారి మరో విశేషం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ జాబితాలో పెద్దగా కనిపించని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నేరుగా పదో స్థానంలోకి ఎంట్రీ ఇవ్వడం. ఆమె టాప్-10లో చోటు దక్కించుకోవడం సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొత్తంగా మే నెల ఓర్మాక్స్ ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే, హీరోయిన్ల పాపులారిటీలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా ట్రెండ్స్, కొత్త సినిమాలు, ప్రేక్షకుల ఆసక్తి, డిజిటల్ ప్రెజెన్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే ఓర్మాక్స్ ర్యాంకింగ్స్‌కు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X