పీకల్లోతు ప్రేమలో మునిగిన బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో హాట్‌గా.. దానికే సంకేతమా?

తమిళ బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొన్న ఓవియా హెలెన్ అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న ఓవియా కమల్ హాసన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ వన్ లో తమిళ ప్రేక్షకులకు చాలా వినోదం పంచింది. మరీ ముఖ్యంగా ఈ భామ హౌస్ లోపల నడిపిన రొమాన్స్ సీక్వెన్స్ లు, లవ్ స్టోరీ ఈ సీజన్ మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. మొదటి సీజన్లో విన్నర్ గా నిలిచిన ఆరవ్ కు ఓవియా బాగా దగ్గరయ్యింది. షో మొదట్లోనే ఆరవ్ తో రొమాన్స్ మొదలు పెట్టిన ఓవియా అతనిని ప్రేమిస్తున్నానని బహిరంగ ప్రకటన చేసింది.. వీరిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ అంతా ఈ షో టిఆర్పి పెంచడానికి బాగా ఉపయోగపడడం తో బిగ్ బాస్ వాళ్లు కూడా పెద్దగా వీరిద్దరిని ఇబ్బంది పెట్టలేదు.

ముద్దు పెట్టుకుంటున్న ఫోటో పోస్ట్ చేయడంతో

ముద్దు పెట్టుకుంటున్న ఫోటో పోస్ట్ చేయడంతో

కానీ చివరికి వచ్చేసరికి వారిద్దరి మధ్య విభేదాలు మొదలై దూరం జరిగారు. ఒకరకంగా తెలుగులో ఎలా అయితే అఖిల్ మోనాల్ మధ్య లవ్ ట్రాక్ నడిచిందో వీరిద్దరి మధ్య కూడా అలాగే లవ్ ట్రాక్ నడిచింది. మరి షో కోసమే లవ్ ట్రాక్ పెట్టారో ఏమో తెలియదు గానీ షో పూర్తయ్యాక తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఇదరూ చెప్పుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే ఆరవ్ మరో నటిని వివాహమాడాడు.

ఆ వివాహం సందర్భంగా కూడా ఓవియా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. తాను కేరళలో ఉన్న కారణంగా వివాహానికి హాజరు కాలేక పోతున్నా అని పేర్కొంది. అయితే తను సింగిల్ అని చెప్పుకుంటున్న ఓవియా జనవరి నెలలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చింది. ఒక వ్యక్తిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో పోస్ట్ చేయడంతో పాటు లవ్ యూ అంటూ ఒక కామెంట్ చేయడంతో ఇంకేముంది ఈ అమ్మడు మరో తోడు వెతుక్కుంది అని అందరూ భావించారు.

ఓవియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్

ఓవియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్

అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం చాలామంది చాలా కామెంట్లు చేసినా ఆమె అసలు స్పందించలేదు. ఇక దాదాపు నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడు అదే వ్యక్తితో ఓవియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఈ భామ అతనితో ప్రేమలో మునిగి పోయింది ఏమో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక బిగ్ బాస్ లో ఉండగా ఆమె పేరిట ఓవియా ఆర్మీ అని ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటయింది. ఇప్పుడు వారంతా ఆమె త్వరలోనే ఒక శుభవార్త చెప్పాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నారు. త్వరలో దానికి సంబంధించిన శుభవార్త కూడా వెలువడే అవకాశం ఉందని వారు ఆశిస్తున్నారు.

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటూ

బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటూ

ఇక నిజానికి కలవాని అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు దగ్గరైన ఓవియా పూర్తి పేరు ఓవియా హెలెన్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం నలభై సినిమాల్లో ఆమె నటించింది. అయితే అంతా అయిపోయాక ఆ మధ్య కాలంలో ఆమె బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని కూడా కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే ఆ మధ్య కాలంలో ఒక నెటిజన్ బిగ్ బాస్ షో ని బ్యాన్ చేయడానికి మీరు ఒప్పుకుంటారా లేదా అని ఆమెను ప్రశ్నిస్తే తాను తప్పక ఒప్పుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ కోసం కంటెస్టెంట్స్ చనిపోయినా పర్లేదు అనే స్థాయిలో బిగ్ బాస్ వాళ్లు టార్చర్ పెడతారు అని ఆమె బిగ్ బాస్ ఉద్దేశిస్తూ సంచలన కామెంట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X