Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ తమిళ ఎంట్రీ ఖరారు, హీరో ఎవరంటే?
'ఆర్ఎక్స్ 100' సినిమా విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్పుత్ మీద సౌత్ ఫిల్మ్ మేకర్స్ కన్నుపడింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో రెండు సినిమాల్లో అవాకాశం దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ ఇపుడు తమిళ సినీ పరిశ్రమలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది.
తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కుతున్న 'ఏంజెల్' మూవీలో మీరా రాజ్పుత్ హీరోయిన్గా ఖరారైంది. తెలుగు బ్యూటీ ఆనందిని కూడా ఇందులో మరో హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది.
ఏంజెల్ చిత్రానికి కెఎస్ అధియమాన్ దర్శకత్వం వహిస్తుండగా, ఓఎస్టి ఫిల్మ్స్ పతాకంపై రామ శరవణన్ ఈ నిర్మించబోతున్నారు. కోలీవుడ్ సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ సంగీతం అందించబోతున్నారు.
'ఆర్ఎక్స్ 100' మూవీలో పాయల్ రాజ్ పుత్ చేసిన బోల్డ్ సీన్లకు కుర్రకారు మాత్రమే కాదు ఫిల్మ్ మేకర్స్ కూడా ఫిదా అయిపోయారు. అలాంటి సీన్లు చేయాలని కొందరు అడల్ట్ స్క్రిప్టులతో వచ్చారట, అయితే కథకు ప్రధాన్యత ఉంటేనే తాను అలాంటివి చేస్తానని తేల్చి చెప్పిందట.
మరో వైపు టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని కూడా పాయల్ బయట పెట్టింది. 'ఆర్ఎక్స్ 100' సినిమా విడుదల తర్వాత కాందరు కాంప్రమైజ్ అయితే అవకాశాలు ఇస్తామని వచ్చారని, వారికి తగిన సమాధానం ఇచ్చి పంపినట్లు వెల్లడించింది.