కుర్రాళ్ల మతిపోయేలా పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ షో.. చూపుతిప్పుకోలేనంత బోల్డ్‌గా -
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తాను చేసే సినిమాలతో పాటు తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు కూడా అంతే బోల్డ్ గా ఉంటాయి. కుర్రాళ్ళ మతిపోయేలా గ్లామర్ షో చేస్తూ చూపు తిప్పుకోలేనంత బోల్డ్ గా ఉన్న ఫోటోలను మరోసారి షేర్ చేసింది పాయల్. ఆ ఫోటోలపై ఒక లుక్కేద్దాం పదండి.
తరచుగా హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో ఉండే పాయల్ రాజ్ పుత్ ఇటీవల కాలంలో ఓ వివాదంలో ఇరుక్కుంది. ఈ బ్యూటీ రక్షణ అనే సినిమా ప్రచారాలకు రాలేదని ఆ మూవీ ప్రొడ్యూసర్స్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం 50 రోజుల కాల్షిట్స్ కేటాయించిన పాయల్ కేవలం 47 రోజులు మాత్రమే పని చేసి, ఆ తర్వాత మూడు రోజులు ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని, కానీ ఈ అమ్మడు మాత్రం ప్రమోషన్స్ కు రావట్లేదు అంటూ తీవ్రంగా విమర్శించారు.

మరోవైపు పాయల్ తన సోషల్ మీడియా ఖాతాలో నిర్మాతలు తనకు ఇంకా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉందని, అవి అడిగితే తనను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారని, తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండానే సినిమాను రిలీజ్ చేస్తున్నారని ఆరోపించింది. ఇక వీరిద్దరి వాదనలు విన్న తర్వాత నిర్మాతల మండలి ఈ సినిమా నిర్మాతలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని పాయల్ కు సర్ది చెప్పింది. దాంతో వివాదం సద్దుమణిగింది.
ఈ వివాదం ఇప్పుడెందుకు అంటే ? ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాల తర్వాత పాయల్ ఈ రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యింది ఈ వివాదంతోనే. తాజాగా ఆమె బోల్డ్ ఫోటోలు వైరల్ అవుతుండడంతో మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పాయల్ చేతిలో రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా ఉన్నట్టుగా సమాచారం.
ఇక ఈ బ్యూటీ అప్పుడప్పుడు బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ తన అభిమానుల దృష్టి ఇతర హీరోయిన్లపై పడకుండా చూసుకుంటుంది. ఎంతమంది హీరోయిన్లు ఉన్నా పాయల్ వేరు అన్పించేలా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో ఆకు పచ్చ రంగులో ఉన్న ప్యాంట్, షర్ట్ వేసుకుని అందంగా కన్పించింది.
నేను నవ్వినప్పుడు బాగుంటాను అంటూ ఆ ఫోటోల పోస్ట్ కు క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ ఫోటోల్లో పాయల్ గ్లామర్ ట్రీట్ చూస్తే కళ్ళు తిప్పుకోవడం కష్టమే. గతంలో కూడా ఆమెకు సంబంధించిన ఇలాంటి ఓ ఫోటోషూట్ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు హాట్ గా ఉన్నావు అంటూ పాయల్ కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ తన గ్రీన్ డ్రెస్ ఫోటోలను పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోని 74,414 లైక్స్ వచ్చాయి అంటే బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











