అలా చేసి ప్రకంపనలు సృష్టించాలని డిసైడ్ అయ్యా.. పాయల్ రాజ్‌పుత్ సంచలనం
ప్రస్తుతం తెలుగు యువత ఏ హీరోయిన్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారనే మాటకొస్తే.. ముందు వరుసలో ఉంటుంది పాయల్ రాజ్‌పుత్ పేరు. అందాలు వడ్డించడంలో దిట్ట అయిన ఈ ముద్దుగుమ్మ.. తన మొదటి సినిమా Rx 100 తోనే కుర్రకారు మనసు దోచుకుంది. ఆ తర్వాత 'సీత' సినిమాలో బులెట్ మీదొచ్చే బుల్ రెడ్డి పాటతో తనలోని హాట్‌నెస్ అంతా బయటపెట్టింది పాయల్. దీంతో ఈమెకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది.
మరోవైపు ప్రస్తుతం తనకున్న క్రేజ్ క్యాచ్ చేసుకునేలా సోషల్ మీడియాలో అందాల విందుకు దిగుతోంది పాయల్. తన తాజా సినిమా RDX లవ్ విశేషాలు, ఆ సినిమాలో ఆమె చేసిన గ్లామర్ ట్రీట్ తాలూకు పోస్టర్స్ షేర్ చేస్తూ మాయ చేస్తోంది. ఈ కోవలోనే తాజాగా ఓ ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది పాయల్. అంత సంచలనం ఏంటబ్బా! అంటారా.. ప్రకంపనలు సృష్టించాలని డిసైడ్ అయ్యా అంటూ సెక్సీ పిక్ ద్వారా ఆమె నెటిజన్ల ముందుకు వచ్చేసింది.

ఇప్పటికే సెక్స్, సెఫ్టీ గురించి ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్న పాయల్.. ఇక ప్రకంపనలు అంటోందంటే ఇంకెలాంటి విషయాల పట్ల ఓపెన్ అవుతుందో అని చెప్పుకుంటున్నారు జనం. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం తన RDX లవ్ సినిమా ద్వారా జనాలను ఎడ్యుకేట్ చేయబోతున్నామంటూ గర్వంగా చెప్పుకుంటోంది.
హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కింది 'RDX లవ్' మూవీ. ఈ చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహించాడు. 'హుషారు' మూవీ ఫేం తేజస్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటించారు. రాధన్ సంగీతం అందించగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పాయల్ క్యారెక్టర్ సెన్సేషన్ క్రియేట్ చేయనుందని టీజర్, ట్రైలర్ ద్వారా తెలిసిపోయింది.


Click it and Unblock the Notifications











