నగ్నంగా నటించడానికి నిరాకరణ.. డైరెక్టర్‌కు స్టార్ హీరోయిన్ షాక్.. అయినా ఆమె కోసం..

దేశం దర్వించదగిన డైరెక్టర్ స్వర్గీయ రాజ్‌కపూర్‌కు వెండితెర షో మ్యాన్ అనే పేరు ఉంది. భావోద్వేగమైన ప్రేమకథలను తెరకెక్కించిన రాజ్ కపూర్ తన హీరోయిన్లను అందంగా, శృంగారభరితంగాను చూపించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. అయితే రాం తేరీ గంగా మైలీ చిత్రంలో హీరోయిన్‌ను నగ్నంగా చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్రను స్టార్ హీరోయిన్ తిరస్కరించిందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే...

క్లీవేజ్ షోతో హల్చల్.. నిక్కీ తంబోలి రచ్చ

హీరోయిన్ల అందాలను తెరపైన..

హీరోయిన్ల అందాలను తెరపైన..

స్వర్గీయ రాజ్‌కపూర్ దర్శకత్వ ప్రతిభను కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ హీరోయిన్లను అత్యంత శృంగారభరితంగా చూపించడంలో తనకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. సత్యం శివం సుందరం సినిమాలో జీనత్ ఆమన్, బాబీలో డింపుల్ కపాడియా అందాలను వెండితెర మీద ఆరబోసిన తీరుకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన ప్రశంసలను అందుకొన్నారు.

రాం తేరి గంగా మైలీలో హీరోయిన్ కోసం

రాం తేరి గంగా మైలీలో హీరోయిన్ కోసం

ఎన్నో రొమాంటిక్, లవ్ స్టోరీలను తెరకెక్కించిన రాజ్‌కపూర్ తన కుమారుడు రాజీవ్ కపూర్ అలియాస్ చింపూతో రాం తేరి గంగా మైలీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు 80వ దశకం చివర్లో సిద్ధమయ్యారు. అందులో అత్యంత శృంగారభరితమైన పాత్ర కోసం అప్పటి స్టార్ హీరోయిన్ పద్మిని కొల్హాపురిని సంప్రదించారు. అయితే నగ్నంగా నటించాలనే రాజ్‌కపూర్ ఆఫర్‌ను పద్మిని మొహమాటం లేకుండా తిరస్కరించారు. ఆ తర్వాత మందాకిని తెరపైకి రావడం, ఆ సినిమా చేసి యువత గుండెల్లో గిలిగింతలు పెట్టారు.

రాజ్ కపూర్ ఆఫర్‌ను తిరస్కరించిన పద్మిని కొల్హాపురి

రాజ్ కపూర్ ఆఫర్‌ను తిరస్కరించిన పద్మిని కొల్హాపురి

అయితే రాం తేరి గంగా మైలీలో ఆ పాత్రను వదులుకోవడానికి కారణాలను ఇటీవల ఈటీటైమ్స్‌తో పంచుకొన్నారు. నటిగా, హీరోయిన్‌గా తన ముందుకు వచ్చే అని పాత్రలను చేయలేను. ఆ సినిమాలో ఉండే హీరోయిన్ పాత్రను చేయడానికి నా ఇమేజ్ అడ్డు వచ్చింది.

ఆ పాత్రను పోషిస్తే నాకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే విషయం రాజ్‌కపూర్‌కు తెలుసు. ఆ విషయం గురించి ఆయనను కన్విన్స్ చేయడంలో సఫలమయ్యాను. అత్యంత శృంగారభరితమైన పాత్రను మందాకిని అద్భుతంగా చేసింది అని పద్మిని కొల్హాపురి చెప్పారు.

 ముద్దు సీన్‌కు కూడా నో...

ముద్దు సీన్‌కు కూడా నో...

రాం తేరి గంగా మైలీ సినిమా ప్రస్తావన మా మధ్య వచ్చినప్పుడు.. బోల్డ్ సీన్లు చేయలేనని రాజ్‌కపూర్‌కు స్పష్టంగా చెప్పాను. కనీసం ముద్దు సీన్‌కు కూడా ఒప్పుకోనని ఖరాఖండిగా తెగేసి చెప్పాను. తెర మీద ముద్దు సీన్లలో నేను అంత కంఫర్ట్ కాదని చెప్పాను. దాంతో మందాకినికి ఆ ఆఫర్ వెళ్లింది అని పద్మిని కొల్హాపురి చెప్పారు.

45 రోజుల షూట్ తర్వాత కూడా

45 రోజుల షూట్ తర్వాత కూడా

అయితే రాం తేరి గంగా మైలీ చిత్రంలో ఆ పాత్రను తనతో ఎలాగైనా చేయించాలనే తపన రాజ్‌కపూర్‌లో ఉండేది. మందాకినితో 45 రోజులు షూటింగు చేసిన తర్వాత కూడా నాతో మాట్లాడారు. నీవు ఒకే అంటే మళ్లీ సినిమాను నీతో రీషూట్ చేస్తానని నాతో అన్నారు అని పద్మిని కొల్హాపురి తెలిపారు.

నగ్నంగా మందాకిని

నగ్నంగా మందాకిని


రాం తేరి గంగా మైలీ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు రవీంద్రజైన్ సంగీతం అందించారు. టైటిల్ సాంగ్‌తోపాటు సున్ సాయిబా సున్.., తుజే బులాయే.. యే బులాయే మేరి బాహెన్ పాట అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఈ పాటలో మందాకిని దాదాపు నగ్నంగానే ఆ పాటలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ప్రేక్షకుల కలలరాణిగా మారిపోయారు.

రాం తేరి గంగా మైలికి అవార్డుల పంట

రాం తేరి గంగా మైలికి అవార్డుల పంట

సంచలన దర్శకుడు రాజ్‌కపూర్ నిర్మాతగా దర్శకత్వం వహించిన రాం తేరి గంగా మైలీ చిత్రంలో మందాకిని, రాజీవ్ కపూర్ జంటగా నటించారు. రాధు కర్ సినిమాటోగ్రఫిని అందించారు. రాజ్ కపూర్ స్వయంగా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 1985 ఆగస్టు 16వ తేదీన రిలీజైన ఈ చిత్రం భారీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఫిలింఫేర్ అవార్డుల్లో పలు అవార్డులను సొంతం చేసుకొన్నది. బెస్ట్ ఫిలిం, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X