ప్రభాస్‌తో పాకిస్తాన్ బ్యూటీ రొమాన్స్.. అలా అడ్డంగా దొరికిపోయిన అందాల భామ!
చాలా వరకు మన దేశానికి చెందిన నటుల్లో కొందరు హాలీవుడ్ లేదా ఇతర దేశాల సినిమాల్లో కనిపిస్తే మనకెప్పుడు మంచి ఎగ్జైటింగ్ గానే అనిపిస్తుంది. అలాగే దీనికి మించి ఇతర సినీ పరిశ్రమకి చెందిన నటీనటులు మన ఇండియన్ సినిమా దగ్గర కనిపిస్తే అది మరింత ఎగ్జైటింగ్ గా ఉంటుంది అని చెప్పాలి. ఈ కలయికలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.
అయితే హాలీవుడ్ నటులు కాదు కానీ ఒక పాకిస్తాన్ హీరోయిన్ మన ఇండియన్ హీరోతో అందులోని మన తెలుగు హీరో సరసన నటించడం అంటే ఆ ఊహ కూడా క్రేజీ లెవెల్లో ఉంటుంది. మరి ఈ కోవలో ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న ఓ సినిమాలో పాకిస్తాన్ నటి ఇమాన్ ఇస్మాయిల్ నటిస్తుంది అని కొన్ని గాసిప్స్ బయటకి వచ్చాయి.

కాగా ఈమె ప్రభాస్ ఇంకా దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ సినిమాలో ఆమె నటిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ బయటకి వచ్చింది. దీనికి ప్రూఫ్ గా తాజాగా ఆమె ప్రభాస్ ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం స్టార్ట్ అయ్యింది. అంతే కాకుండా ఆమెని దర్శకుడు హను రాఘవపూడి ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు.
దీనితో ముగ్గురికి కనెక్షన్ క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి పాకిస్తాన్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్ చేయడం అనేది దాదాపు ఖరారు అయిపొయింది అని చెప్పవచ్చు. కాగా ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈమె తండ్రి పాకిస్తాన్ కి చెందినవాడు కాగా ఆమె తండ్రి పంజాబ్ కి చెందినవారు అట. ఆమె ఢిల్లీలో పుట్టిందట, కానీ పాకిస్తాన్ లో నటిగా స్థిరపడింది అట.

ఇలా ఈ పాకిస్తాన్ బ్యూటీ ప్రభాస్ సరసన నతిష్టించే ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభాస్ తో హను రాఘవపూడి చేస్తున్న సినిమాకి "ఫౌజి" అనే టైటిల్ ని మేకర్స్ పెట్టగా ఈ సినిమా కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో అది కూడా సీతారామం తరహాలోనే ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలోనే తెరకెక్కించనున్నట్టుగా టాక్. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రం కల్కి 2898 ఎడి వసూళ్లతో దుమ్ము లేపుతుంది.
ఇక చిత్రీకరణలో దర్శకుడు మారుతీతో "ది రాజా సాబ్", దర్శకుడు ప్రశాంత్ నీల్ తో "సలార్ 2" లు సెట్స్ మీద ఉండగా నెక్స్ట్ "స్పిరిట్", ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ స్టార్ట్ చేస్తాడు, ఇందులో కొరియన్ నటుడు డాన్ లీ కనిపిస్తాడు అనే స్ట్రాంగ్ రూమర్స్ కూడా ఉన్నాయి. దీనితో ఈ సినిమాతో కూడా ఫారిన్ నటుడు ఇండియన్ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందని చెప్పాలి. అలాగే కల్కి పార్ట్ 2 షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రభాస్ స్టార్ట్ చేయనుండగా ఆ తర్వాత హను రాఘవపూడితో సినిమా మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











