Sanvikaa : రీల్లో క్యూట్ అండ్ స్వీట్.. రియల్ గా మాత్రం యమా హాట్ గురూ

పంచాయత్‌ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌ వచ్చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని 'ఫులేరా' అనే పల్లెటూర్లో పంచాయతీ ఆఫీస్ లో ఆ పంచాయతీ సెక్రటరీకి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో మొదటి సీజన్‌ అంతా సాగితే ఇప్పుడు రెండో సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ రెండో సీజన్ లో లేడీ లీడ్ గా ఎంట్రీ ఇచ్చిన రింకీ ఎవరు? అనే విషయం మీద చర్చ జరుగుతోంది. అయితే ఆమె పాత ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఎంబిఏ చదివి

ఎంబిఏ చదివి


2020లో 'పంచాయత్‌' వెబ్‌ సిరీస్‌ రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు 'పంచాయత్‌ సీజన్‌ 2' స్ట్రీమ్‌ అవుతోంది. ఈ సీజన్ కూడా ఇప్పుడు అభిమానులను అలరిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని 'ఫులేరా' అనే ఒక కల్పిత గ్రామంలో జరిగినట్టుగా చెప్పే ఈ కథలో అందరూ అమాయకులే. ఆ గ్రామ సచివాలయ ఉద్యోగిగా వచ్చిన అభిషేక్‌కు ఎంబిఏ చదివి వేరే ఉద్యోగం చేయాలని కోరిక ఉండడంతో ఎంట్రన్స్‌ టెస్ట్‌కు ప్రిపేర్‌ అవుతూ ఉంటాడు.

సైకోలాగా మారి

సైకోలాగా మారి

ఈ క్రమంలోనే ఆ ఊరి సర్పంచ్‌తో, ఉప సర్పంచ్‌తో, అసిస్టెంట్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. అన్ని ప్రాంతాల్లో లాగే ఆ ఊరి సర్పంచ్‌ స్త్రీ (నీనా గుప్తా) అయినా సర్పంచ్‌ భర్త (రఘువీర్‌ యాదవ్‌) వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. అభిషేక్‌ (జితేంద్ర కుమార్‌) వారి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మొదటి సిరీస్‌లో సర్పంచ్‌ కూతురు ఉంటుంది కాని ఎక్కడా కనిపించదు. కాని ఈ సిరీస్‌లో ఆ కూతురు కనిపిస్తుంది, ఆమే రింకీ. సర్పంచ్‌ రఘువీర్‌ యాదవ్‌ తన కుమార్తె కోసం సంబంధం చూస్తే ఆ పెళ్లి కొడుకు సైకోలాగా మారి ఆ అమ్మాయికి తెగ ఫోన్లు చేస్తుంటాడు.
 అందమైన ఫోటోలు షేర్ చేసి

అందమైన ఫోటోలు షేర్ చేసి


దాన్ని అభిషేక్ స్వయంగా క్లియర్ చేస్తాడు. రింకూ అసలు పేరు సాన్విక. సాన్విక వెబ్ సిరీస్ లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. కానీ ఆమె ఎవరు అనే విషయం వెతికితే మాత్రం ఎలాంటి సమాచారం దొరకలేదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆమె చాలా అందమైన ఫోటోలు షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో సాన్విక అందంగా కనిపిస్తోంది. ఆమె తల్లిదండ్రులుగా ప్రముఖ నటులు నీనా గుప్తా, బ్రిజ్ భూషణ్ దూబే నటించారు.

కాస్ట్యూమ్ అసిస్టెంట్ గా

కాస్ట్యూమ్ అసిస్టెంట్ గా


ఇక సాన్విక బీచ్‌లో నీటితో ఆడుకుంటున్న ఫోటోలు కూడా షేర్ చేసింది. సాన్వికా ఇచ్చిన ఇటీవలి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను మొదట్లో అనేక ఆడిషన్‌లు ఇవ్వడానికి, యాక్టింగ్ వర్క్‌షాప్‌లలో పాల్గొనడానికి ముందు కాస్ట్యూమ్ అసిస్టెంట్ గా పనిచేశానని చెప్పింది. తాను ఒక ప్రకటన ఆడిషన్ కోసం వెళ్లానని అక్కడ నుంచి TVF ద్వారా రూపొందించబడిన పంచాయత్‌లో రింకీ పాత్రలో నటించగలను అని అనుకోలేదని పేర్కొంది.

ఎక్కడా తగ్గట్లేదుగా

ఎక్కడా తగ్గట్లేదుగా


షూటింగ్ సమయంలో జితేంద్ర కుమార్ తనకు చాలా సపోర్ట్ ఇచ్చాడని ఆమె తన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇక సిరీస్ లో చాలా పద్దతిగా కనిపించిన ఆమె సోషల్ మీడియాలో మాత్రం మోడరన్ అమ్మాయిలాగానే అందాలు ఆరబోసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలలో చాలా అందంగా కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X