ఇరకాటంలో పడ్డ త్రిష.. ప్రమోషన్లకు రానంటే రెమ్యూనరేషన్ తిరిగివ్వాలి.. నిర్మాతలు ఫైర్

తమిళ నాట త్రిష చేసిన నిర్వాకం ఇప్పుడు పెద్ద చర్చను లేవనెత్తింది.మామూలుగా హీరో హీరోయిన్లు చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొని జనాల్లోకి వెళ్లేలా చేస్తారు. అయితే ఈ సూత్రం ఒక్క నయనతార విషయంలోనే మినహాయింపు. ముందు నుంచీ నయన్ హవా అలా కొనసాగుతోంది. రజినీ సినిమా అయినా, మెగాస్టార్ సినిమా అయినా సరే ప్రమోషన్లకు మాత్రం నయన్ రాదు. ఎందుకంటే దానికి కారణాలుండవు.. అదంతే. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేరు. అయితే ఇదే బాటలో త్రిష నడుద్దామని అనుకుందో ఏమో గానీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

త్రిష కొత్త చిత్రం..

త్రిష కొత్త చిత్రం..

24 హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై దర్శక నిర్మాత తిరుజ్ఞానం తెరకెక్కించిన చిత్రం పరమపదం విళైయాట్టు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా చిత్ర ప్రీ ప్రమోషన్‌ కార్యక్రమం శనివారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్‌లో చిత్ర యూనిట్‌ నిర్వహించారు.

రజినీ, కమల్ వంటి వారే..

రజినీ, కమల్ వంటి వారే..

నిర్మాత సురేశ్‌కామాక్షి మాట్లాడుతూ.. హీరోయిన్ల తాము నటించిన చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదే అర్థం కావడం లేదన్నాడు. ప్రముఖ నటులు రజనీకాంత్, విజయ్, కమలహాసన్‌ వంటి వారే తాము నటించిన చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలకు వస్తున్నప్పుడు హీరోయిన్లు ఎందుకు రావడం లేదో తెలియడం లేదన్నాడు.

అలా చేస్తే కొత్తవారితోనే..

అలా చేస్తే కొత్తవారితోనే..

స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేస్తే మంచి ప్రచారం లభిస్తుందనే వారిని ఎంపిక చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. వారు ఇలా ప్రమోషన్లకు రాకుండా.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లకుండా ఉండే... కొత్తవారికే అవకాశాలు ఇచ్చి చిత్రాలు చేస్తామని అన్నాడు.

Recommended Video

Is Trisha Back To Tollywood With This Movie ? || అందరి డౌట్ దానిపైనే!
సగం పారితోషికం..

సగం పారితోషికం..

నిర్మాతలమండలి నిర్వాహకుడు, నిర్మాత శివ మాట్లాడుతూ ఈ చిత్ర ప్రమోషన్‌కు నటి త్రిష రాకపోవడం బాధాకరంగా ఉందని అన్నాడు. చిత్రం ఈ నెల 28న విడుదల కానుందని, ఈలోగా ఆమె చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని అల్టిమేటం జారీ చేశాడు. లేదంటే ఆమె తీసుకున్న పారితోషికంలో సగ భాగాన్ని నిర్మాతకు తిరిగివ్వాల్సి ఉంటుందని నిర్మాతల సంఘం తరఫున హెచ్చరిస్తున్నట్లు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X