నిజం ఒప్పుకుంది: హీరోయిన్ తమన్నా పెళ్లి ప్రయత్నాలు షురూ...

Recommended Video

Actress Tamannaah Bhatia To Get Married Soon | Filmibeat Telugu

సినిమా హీరోయిన్లు ఏ విషయంలో అయినా ఓపెన్‌గా మాట్లాడతారు కానీ... ప్రేమ, పెళ్లి అంశాలను మాత్రం వీలైనంత గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి గురించి ఏదైనా టాపిక్ వస్తే ప్రస్తుతం ఆ ఉద్దేశ్యం లేదని, కెరీర్ మీదే పూర్తి ఫోకస్ పెట్టామంటూ కహానీలు చెబుతారు.

తెలుగు హీరోయిన్ తమన్నా పెళ్లి విషయంలో కూడా చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ముంబై బ్యూటీ సైతం గతంలో ఇదే పాట పాడుతూ వచ్చారు. తాజాగా తమన్నా పెళ్లి గురించి ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అయితే ఈ సారి నిజం ఒప్పుకున్నారు.

తమన్నా పెళ్లి ప్రయత్నాలు షురూ...

తమన్నా పెళ్లి ప్రయత్నాలు షురూ...

తమన్నా పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ విషయాన్ని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇంట్లో తన కోసం వరుడిని వెతుకుతున్నారని, తాను కూడా ఓకే చెప్పినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఎవరూ ఇంకా ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు.

వారు ఎవరిని చూపితే వారినే చేసుకుంటా

వారు ఎవరిని చూపితే వారినే చేసుకుంటా

పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయం అమ్మా నాన్నకే వదిలేశాను, వారు చూపించిన అబ్బాయిని చేసుకుంటానని తమన్నా చెప్పుకొచ్చారు. నాకు ఎలాంటి వాడు కావాలో నాకంటే అమ్మానాన్నకే బాగా తెలుసు, వారి సెలక్షన్ మీద పూర్తి నమ్మకం ఉందన్నారు.

ప్రేమ, డేటింగ్ అలాంటివి ఏమీ లేవు

ప్రేమ, డేటింగ్ అలాంటివి ఏమీ లేవు

తమన్నా కొంతకాలంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందని, అతడితో డేటింగ్ చేస్తోంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమన్నా స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదని, ఒక వేళ అలాంటివి ఏమైనా ఉంటే రహస్యంగా చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఆ ప్లాట్ కొనుగోలుతో తమన్నాపై పుకార్లు

ఆ ప్లాట్ కొనుగోలుతో తమన్నాపై పుకార్లు

ఇటీవల తమన్నా ముంబైలో ప్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో తమ కూతురు పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా తమన్నా తల్లిదండ్రులు కాబోయే భార్య భర్తలు ఇద్దరి పేరు మీద ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే తమన్నా మాత్రం తన పెళ్లిప్రయత్నాలు జరుగుతున్న మాట నిజమే కానీ.... వరుడు ఎవరు? అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదని అంటోంది.

తమన్నా సినిమాలు

తమన్నా సినిమాలు

తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన తెలుగు చిత్రాలు దట్ ఈజ్ మహాలక్ష్మి, సైరా నరసింహారెడ్డి, తమిళ మూవీ పెట్రోమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటు తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమా, హిందీలో మరో చిత్రం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X