RRRలో బాలీవుడ్ బ్యూటీ.. భారీ పారితోషికం డిమాండ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఇంతవరకు ఈ చిత్రంలో నటించే హీరోయిన్లని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆ పనిమీదే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్లుగా కీర్తి సురేష్, అదితి రావు హైదరి, సమంత ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల చిత్ర యూనిట్ పరిణితి చోప్రాని ఈ చిత్రం కోసం సంప్రదించారట. పరిణితి చోప్రా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పరిణితి చోప్రా అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ద పడినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ లో మొత్తం ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందట. మరి రాజమౌళి ఎవరిని ఎంపిక చేసుకుంటాడో చూడాలి. తమిళ నటుడు సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపికయ్యాడు. స్వాతంత్య్రానికి పూర్వం 1920 కాలం నాటి పరిస్థితుల్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే రాజమౌళి తెరకెక్కించే ఈ చిత్రానికి కూడా కీరవాణే సంగీత దర్శకుడు. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











