Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎప్పుడు చూసినా అతని వెంటే పరిణితి.. దాని కోసం ఇంతలా తపిస్తోందా?
అదేదో సామెత ఉంటుంది కదా.. ఎవరి కష్టాలు వారివి అన్నట్లుగా! హీరోయిన్ పరిణితి చోప్రా కష్టాలు చూస్తుంటే అది అక్షరాలా నిజమే అని తెలుస్తోంది. ఆమె తపన, డెడికేషన్ చూసి షాక్ అవుతున్నారంతా. ఇక ఎక్కడికెళ్లినా ఆ కోచ్ పక్కన లేకుండా ఆమె కనిపించడం లేదంటేనే ఆమె తపన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఓ పరిణితి చెందిన అందాల భామ ఇంతలా పరితపించడం ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. ఇక విషయం లోకి వస్తే..
బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌లా
పరిణితి కష్టాలన్నీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌లా కనిపించడం కోసమే. గ్లామర్ ప్రపంచంలో ఉన్న ఓ హీరోయిన్ గ్రౌండ్ లో కేకలు పుట్టించాలంటే ఎంత కష్టపడాలి? దాని కోసమే పరితపిస్తోంది పరిణితి చోప్రా. సైనా నెహ్వాల్ బయోపిక్ లో తన పాత్రకు మెరుగులు పెట్టేందుకు ఈ హీరోయిన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావండోయ్!
ఎక్కడికెళ్లినా అతను గ్యారెంటీ..
గ్రౌండ్ లో ప్రదర్శించే ఆటతీరును సినిమా కోసం అడాప్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. పైగా సైనా నెహ్వాల్ లాంటి బ్యాడ్మింటన్ స్టార్ కావాలంటే ఎంతో శ్రమించాలి. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ కోచ్ అవసరమే కదా. అందుకే తనకు బ్యాడ్మింటన్ లో శిక్షణ ఇచ్చేనందుకు గాను ప్రత్యేక కోచ్ ని నియమించుకుంది పరిణితి. కాకపోతే పరిణితి ఎక్కడికెళ్లినా అక్కడ అతను కూడా గ్యారెంటీగా దర్శనమిస్తుండటం చర్చనీయాంశం అయింది.
దీన్ని బట్టే తెలుస్తోంది.. అసలు సంగతేంటో
లండన్, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశంలో షూటింగ్ కి వెళ్లినా కూడా అమ్మడు తన కోచ్ ని వదలడంలేదట. అంటే దీన్ని బట్టే తెలుస్తోంది సైనా పాత్రలో లీనం కావడానికి ఈ పరిణితి చెందిన బ్యూటీ ఎంతగా తపిస్తోందో! ఈ రకంగా కూడా సుకుమారి పరిణితి వార్తల్లో నిలవడం విశేషం గానే చెప్పుకోవచ్చు మరి.
శ్రద్ధా కపూర్ కాదనడంతో పరిణితి
అమోల్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనున్న సైనా నెహ్వాల్ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్ నటించాల్సి ఉంది. కానీ ఈ పాత్ర పట్ల ఆమె అశ్రద్ధ చూసిన మేకర్స్ ఆమెను తప్పించి ఆ స్థానంలో పరిణితి చోప్రాను సెలెక్ట్ చేశారు. శ్రద్ధా తప్పుకున్నాక ఏడాది టైమ్ వేస్ట్ చేసిన చిత్రయూనిట్.. ఈ సినిమా నిర్మాణంపై మళ్లీ ఇప్పుడు దృష్టి పెట్టిందట. మరి పరిణితి ఎంత పరిణితిగా సైనా నెహ్వాల్ లాంటి ఛాలెంజింగ్ రోల్లో ఎలా మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.