పరిణితి చోప్రా భర్తకు ప్రాణాంతక వ్యాధి.. ఎంపీకి కంటిచూపు పోయేంతగా ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా భర్త రాఘవ్ చద్దా పెళ్ళయ్యి ఏడాది కూడా కాకముందే తీవ్రమైన కంటి జబ్బు బారిన పడ్డారు. దానికి సంబంధించిన ఆపరేషన్ తాజాగా పూర్తి కాగా ఆయన కొలుకుంటున్నట్టు సమాచారం.

బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా రీసెంట్ గా అమర్ సింగ్ చమ్కిలా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. రీఎంట్రీ తరువాత ఈ రేంజ్ లో హిట్ దక్కిందని సంతోషించేలోపే ఆమె భర్త అనారోగ్యం బారిన పడ్డారు. ఇంతకీ పరిణితి భర్త రాఘవ్ చద్దాకు ఏమైందో మనం కూడా తెలుసుకుందాం పదండి.

Parineeti Chopra Husband AAP MP Raghav Chadha gone Through Major Surgery Here is disease details

పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా 2023 సెప్టెంబర్ 24 న ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ జంటకు పెళ్లయి ఏడాది కూడా కాలేదు. ఇప్పుడు రాఘవ్ చద్దాకు ఆరోగ్య సమస్య వచ్చింది. తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్న రాఘవ్ చద్దా ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నారు. సమస్య చాలా తీవ్రంగా ఉందని, రాఘవ్ చద్దా తన దృష్టిని పూర్తిగా కోల్పోవచ్చని అక్కడి వైద్యులు వెల్లడించారనే వార్త వైరల్ అవుతోంది.

ఈ విషయాన్ని యూపీ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న కారణంగానే రాఘవ్ చద్దా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. రాఘవ్ కంటికి శస్త్ర చికిత్స చేశారని, ప్రస్తుతం రాఘవ్ లండన్‌లో ఉన్నారని చెప్పారాయన.

సమస్య తీవ్రంగా ఉందని, అయితే ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఆపరేషన్ అనంతరం బాగానే కోలుకుంటున్నారని రాఘవ్ చద్దా ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. త్వరలో కోలుకుని ఢిల్లీలో పార్టీ ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.

రాఘవ్ చద్దా తన రెటీనాలో రంధ్రం కారణంగా లండన్‌లో వెంటనే కంటి ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది అతను ఇప్పటికీ లండన్‌లో బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. వైద్యులు అతనికి అనుమతి ఇచ్చిన తర్వాత భారతదేశానికి వస్తాడు. త్వరలోనే పరిణితి ఆయనను చూడడానికి వెళ్ళవచ్చు.

Parineeti Chopra Husband AAP MP Raghav Chadha gone Through Major Surgery Here is disease details

రాఘవ్ కొన్ని రోజుల నుంచి లండన్‌లో ఉంటున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆయన ఇటీవల కాలంలో రాజకీయాపై స్పందించలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కూడా ఆయన సోషల్ మీడియాలో ఖండించారు. దీంతో రాఘవ్ చద్దా ఏమయ్యాడు అంటూ ఆరా తీస్తే ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకున్నాడు అనే విషయం వెలుగులోకి వచ్చింది.

పరిణీతి చోప్రా రీసెంట్‌గా 'అమర్ సింగ్ చమ్కిలా'లో నటించింది. ఈ మూవీలో పరిణీతి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాలో తన నటనపై వచ్చిన ప్రశంసలను ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యింది ఈ హిందీ భామ. ఇప్పుడు పరిణీతి తన భర్త రాఘవ కంటి సమస్య నుంచి త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.

కాగా రానున్న ఎలక్షన్ లో భాగంగా రాఘవ్ చద్దా ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్‌లో అతని మొత్తం చరాస్తుల విలువ రూ.36,99,471 అని వెల్లడించారు. రాఘవ్ చద్దా వద్ద మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు, దాదాపు రూ.4,95,000 విలువైన 90 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. 6 లక్షలు బాండ్లు, స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు అందులో రాసుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X