twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడబోతోందా? అసలు వాస్తవం ఇదీ...

    |

    ప్రియాంక చోప్రా తన అమెరికన్ బాయ్ ఫ్రెండ్ నిక్ జొనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రియాంక ఫ్యామిలీలో మరో వివాహం జరుగబోతోందని, ఆమె సోదరి, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    పరిణీతి చోప్రా కొంతకాలంగా చరిత్ దేశాయ్‌తో రిలేషన్ షిప్‌లో ఉంది. చరిత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. హృతిక్ రోషన్ మూవీ అగ్నిపథ్ చిత్రానికి పని చేయడంతో పాటు, కరణ్ జోహార్ బేనర్ ధర్మప్రొడక్షన్లో కొన్నేళ్లుగా వర్క్ చేస్తున్నాడు.

     ప్రియాంక పెళ్లిలో సందడి

    ప్రియాంక పెళ్లిలో సందడి

    అయితే వీరి రిలేషన్ షిప్ ఇంకా నెక్ట్స్ లెవల్‌కు వెళ్లకముందే ఇంట్లో వారికి విషయం తెలిసి పోయిందని, వారు కూడా వీరి రిలేషన్ షిప్ మీద సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రియాంక-నిక్ జొనాస్ పెళ్లి వేడుకలో కూడా ఇద్దరూ కలిసి సందడి చేశారని టాక్.

    త్వరలో పెళ్లి అంటూ వార్తలు

    త్వరలో పెళ్లి అంటూ వార్తలు

    బాలీవుడ్ సెలబ్రిటీలతో విదేశాల్లో నిర్వహించిన ‘డ్రీమ్ టీమ్ టూర్ 2016' సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అలా మొదలైన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. త్వరలో పరిణీతి, చరిత్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ ఆంగ్లపత్రికలో కథనం రావడంతో పరిణీతి స్పందించారు.

    పెళ్లి వార్తలను ఖండించిన పరిణీతి

    పెళ్లి వార్తలను ఖండించిన పరిణీతి

    తన పెళ్లి గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదేని, నేను పెళ్లి చేసుకునే సమయం వచ్చినపుడు హ్యాపీగా ప్రకటిస్తాను.....అంటూ పరిణీతి చోప్రా ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

    పరిణీతి చోప్రా

    పరిణీతి చోప్రా

    పరిణీతి చోప్రా ప్రస్తుతం దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్' అనే చిత్రంలో అర్జున్ కపూర్‌కు జోడీగా నటిస్తోంది. దీంతో పాటు అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా ‘కేసరి'లో అక్షయ్ కుమార్‌ సరసన చేస్తోంది.

    English summary
    Parineeti Chopra To Marry Boyfriend Charit Desai? Actress Broke Silence. "ABSOLUTELY BASELESS AND UNTRUE!! I will happily announce whenever I am getting married!" She said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X