ఒకసారి రష్మిక మందన్న.. మరోాసారి కియారా.. బాలీవుడ్ హీరోయిన్ కు చుక్కలు
బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాకు తెలుగు ప్రేక్షకులతో పెద్దగా పరిచయం లేదు. కానీ హిందీ చిత్రాలతో బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నటిగానే కాకుండా బిజినెస్ పర్సన్ గానూ పలు వ్యాపారాలను చూస్తుకుంటోంది. ముఖ్యంగా సినిమాల ద్వారా ఎప్పుడూ తన పేరు వార్తల్లో ఉంటుంది. 2011 నుంచి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిణితి చోప్రా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ఆమె కెరీర్ 2 పెద్ద సినిమాలను మిస్ అయ్యింది. అందుకు కారణం రష్మిక మందన్న, కియారా అద్వానీ కావడం గమనార్హం. ఇక ఆ వివరాల్లోకి వెళితే..
పరిణితి చోప్రా సినిమాలు..
హర్యానాకు చెందిన పరిణితి చోప్రా 22 అక్టోబర్ 1988లో అంబాలలో జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 36 ఏళ్లు. 2023లో ఈమె రాఘవ్ చద్దాను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇక 2011లో లేడీస్ వర్సెస్ రిక్కీ బహ్ అనే చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇప్పటి వరకు 18 చిత్రాల్లో నటించి మెప్పించింది. అన్ని హిందీ భాషలోనే రూపుదిద్దుకున్నాయి. ఇష్క్ జాదె, శుద్ దేసి రొమాన్స్, హసీ తో ఫసీ, కిల్ దిల్, డిష్యూమ్, గోల్ మాల్ అగైన్, కేసరి, సైనా, మిషన్ మంగల్, అమర్ సింగ్ చమ్కిలా వంటి చిత్రాలతో అలరించింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన నటించిన శుద్ దేసి రొమాన్స్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా అలరిస్తోంది.

పరిణితి చోప్రా మిస్ చేసుకున్న చిత్రాలివే..
తన పెళ్లి తర్వాత పరిణితి చోప్రా కాస్తా సినిమాల జోరును తగ్గించింది. కానీ కరోనా కంటే ముందు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హల్ చల్ చేసింది. దీంతో ఆమె పేరు బాలీవుడ్ లో మారుమోగింది. అదే సమయంలో టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ చిత్రం రూపుదిద్దుకునేందుకు సిద్ధమవుతోంది. ఆ చిత్రంలో హీరోయిన్ గా మొదటిగా పరిణితికే అవకాశం దక్కింది. అలాగే మరోసారి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోనే రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలోనూ పరిణితికి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ చివరల్లో ఛాన్స్ మిస్ అయ్యింది.
రష్మిక మందన్న ఇలా.. కియారా అద్వానీ అలా..
కబీర్ సింగ్ చిత్రం సమయంలో కియారా అద్వానీ క్రేజ్ తో పరిణితి చోప్రాకు అవకాశం చేజారిపోయింది. ఇక పుష్ప చిత్రంతో రష్మిక మందన్న శ్రీవల్లిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో యానిమల్ చిత్రంలో మొదటగా సందీప్ రెడ్డి వంగ పరిణితి చోప్రానే అనుకున్నా కూడా చివరి క్షణంలో రష్మికను ఫైనల్ చేశారు.
దీంతో రెండు సెన్సేషనల్ చిత్రాలను పరిణితి చోప్రా వదులుకుంది. ఆ సినిమాల్లో గనుక పరిణితి నటించి ఉంటే గనుక ఆమె కెరీర్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లేందని బాలీవుడ్ సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక నెక్ట్స్ పరిణితి చోప్రా చేతిలో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇంకా ఆ చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటించలేదు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ ఎండింగ్ లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











