Parineeti Chopra : అందాల విందు.. రెడ్ బికినీలో నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పరిణీతి చోప్రా ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. హిందీ సినిమాలో పరిణీతి తక్కువ సమయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో పరిణీతి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది. తన కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలలో భాగం అయిన ఆమె ఇప్పుడు వర్క్ నుంచి బ్రేక్ తీసుకుంది. ఆమె మాల్దీవుల్లో వెకేషన్ ఆస్వాదిస్తోంది. పరిణీతితో పాటు, ఆమె కుటుంబం కూడా మాల్దీవుల్లో హాలిడేని ఆస్వాదిస్తోంది. పరిణీతి తన సెలవుల ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అయితే వాటిలో పరిణీతి బికినీ పిక్ మాత్రం ఇంటర్నెట్‌లో సెన్షేషన్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

బికినీ షోతో రెచ్చిపోయి

బికినీ షోతో రెచ్చిపోయి

ప్రియాంక చోప్రా చెల్లి, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా బీచ్‌లో బికినీ షోతో రెచ్చిపోయింది. గత కొన్నిరోజుల క్రితం మాల్దీవ్స్ బీచ్‌లో బికినీ వేసి తెగ హల్చల్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పరిణీతి. ఈ చిత్రంలో, పరిణీతి ఎరుపు రంగు బికినీలో చాలా బోల్డ్‌గా కనిపిస్తోంది.

సినిమాల్లో అలా

సినిమాల్లో అలా

ఆమె 2011 లో రొమాంటిక్ కామెడీ 'లేడీస్ వర్సెస్ రికీ బహల్'తో సినీ ఎంట్రీ ఇచ్చింది. 'ఇషాక్జాదే' (2012), 'శుద్ధ్ దేశీ రొమాన్స్' (2013), మరియు 'హసీ తో ఫేసీ' సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. 'గోల్‌మాల్ అగైన్' (2017) మరియు యుద్ధ ఇతిహాసం 'కేసరి' (2019) వంటి చిత్రాలు ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి.

ప్రశంశల వర్షం

ప్రశంశల వర్షం

ఇక ఈ ఫోటో పోస్ట్ చేయడంతో చాలా తక్కువ సమయంలో ఫోటోపై మిలియన్ల కొద్దీ లైకులు మరియు వేలాది కామెంట్స్ వస్తున్నాయి. అభిమానులే కాదు తారలు కూడా దీనిపై వ్యాఖ్యానిస్తూ ఆమె ఫోటోల మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పరిణీతి మాల్దీవుల సెలవులకు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి, కానీ ఇప్పుడు ఆమె బికినీ ఫోటో మీద సోదరి ప్రియాంక చోప్రా కూడా వ్యాఖ్యానించింది.

ఖచ్చితంగా'

ఖచ్చితంగా'

పరిణీతి యొక్క ఈ బికినీ ఫోటోను అభిమానులు మరియు తారలు చాలా ఇష్టపడుతున్నారు. పరిణీతి ఫోటో షేర్ చేస్తూ శీర్షికలో సన్‌బర్ంట్ అని వ్రాశారు. ఇక సోదరి ప్రియాంక చోప్రా కూడా ఈ ఫోటోపై వ్యాఖ్యానించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానిస్తూ, ప్రియాంక బహుశా ఇన్స్పైరింగ్ గా కనిపిస్తోంది అని కామెంట్ చేయగా దానికి పరిణీతి, 'బహుశా కాదు, ఖచ్చితంగా' అని సమాధానమిచ్చింది.

సినిమా విషయానికి వస్తే

సినిమా విషయానికి వస్తే

పరిణీతి చోప్రా ఈ సంవత్సరం మూడు సినిమాలు విడుదల చేశారు: 'సందీప్ ఔర్ పింకీ ఫరార్, ' 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్, ' మరియు 'సైనా.' సినిమాలతో ఆమె ముందుకు వచ్చింది. ఇక మరోవైపు, పరిణీతి త్వరలో రణబీర్ కపూర్‌తో 'యానిమల్' చిత్రంలో కనిపించనుంది. మొత్తం మీద పరిణీతి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె బికినీ ఫోటో మీరు కూడా చూసేయండి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X