Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వామ్మో 'పరుగు' భామ ఇలా అయ్యిందేంటి.. ఈ వయసులో కూడా హద్దులు లేకుండా అందాల ఆరబోత
కొంతమంది హీరోయిన్స్ వచ్చిన కొత్తలో గ్లామర్ విషయంలో హద్దులు దాటడానికి ఏ మాత్రం ఇష్టపడరు. ఇక మరికొందరు మాత్రం కాలంతో పాటు కొన్నిసార్లు మరో అడుగు ముందుకు వేయాల్సి వస్తుంటుంది. ఎంతోమంది హీరోయిన్స్ పెద్ద సినిమాలో ఛాన్స్ అందుకోవడానికి బికినీలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది బ్యూటీలు గ్లామర్ హద్దులను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఇక అలాంటి వారిలో పూనమ్ బజ్వా కూడా చేరిపోయింది.
అప్పట్లో పద్దతిగా కనిపించి..
ఈ బ్యూటీ గురించి అందరికి తెలిసే ఉంటుంది. నవదీప్ నటించిన 'మొదటి సినిమా' అనే మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ అప్పట్లో తన హోమ్లీ అందంతో ఓ వర్గం కుర్రకారును అమితంగా ఆకట్టుకుంది. ఆ సినిమా మ్యూజికల్ గా హిట్టవ్వడంతో అమ్మడికి రెండు మూడు ఆఫర్స్ వెంటవెంటనే వచ్చాయి.
నాగార్జున సినిమాలో..
ముఖ్యంగా నాగార్జున బాస్ సినిమాలో కూడా ఈ బ్యూటీ మంచి ఛాన్స్ కొట్టేసింది. అందులో స్పెషల్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నప్పటికి సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో అమ్మడికి ఆ తరువాత పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కలేదు. అలాగే కన్నడ తమిళ్ లో కూడా కొన్ని మీడియం బడ్జెట్ సినిమాల్లో మంచి ఛాన్సులు రావడంతో కొన్నాళ్ళు బిజీగా కనిపించింది.
పరుగు సినిమాలో..
ఒకనొక టైమ్ లో ఛాన్సులు రాకపోవడంతో అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన పరుగు సినిమాలో ఒక సపోర్టింగ్ పాత్రలో నటించింది. హీరోయిన్ అక్కగా కనిపించిన పూనమ్ బాజ్వా ఎమోషనల్ సీన్స్ లో అద్భుతమైన నటనను కనబరిచింది.
ఎన్టీఆర్ బయోపిక్ లో..
ఇక ఆ తరువాత మళ్ళీ ఈ బ్యూటీ తెలుగు సినిమాలో కనిపించలేదు. ఎక్కువగా తమిళ్ మలయాళంలో బిజీబిజీగా కనిపించింది. ఇక మొన్న బాలకృష్ణ కథానాయకుడు లోకేశ్వరో పాత్రలో కనిపించింది. ఆ సినిమా కూడా అనుకున్నంత రేంజ్ లో హిట్టు కాకపోవడంతో అమ్మడు మళ్ళీ తమిళ్ మలయాళం సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.
Recommended Video
అందాల ఆరబోత
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు పదుల వయసులో ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించడం లేదు. తన ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఎదో ఒక హాట్ ఫొటోను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల నడుము అందాలను వయ్యారంగా ప్రజెంట్ చేసి ఓ వర్గం నెటిజన్లకు షాక్ ఇచ్చింది. మరి ఈ గ్లామర్ ప్రజెంటేషన్ తో అయినా అమ్మడికి మంచి ఛాన్సులు దొరుకుతాయో లేదో చూడాలి.