‘నాకు చాలా మందితో అఫైర్లు.. గత 3 ఏళ్లుగా నా రొమాంటిక్ పరిస్థితి ఏంటంటే?’
దక్షిణాది సినిమా పరిశ్రమలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో పార్వతి తిరువోతు ఒకరంటే ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. మలయాళ, తమిళ, తెలుగు, ఇంగ్లీష్ సినిమా రంగాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. అయితే ఇటీవల జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డేటింగ్ లైఫ్, రిలేషన్‌షిప్ తదితర అంశాలను ఆమె బోల్డుగా వెల్లడించారు. ఆమె తాను చెప్పిన విషయాల్లోకి వెళితే..
మలయాళ సినిమా పరిశ్రమలో అవుటాఫ్ సిలబస్, నోట్ బుక్, వినోదయాత్ర లాంటి సినిమాలతో 2006 సంవత్సరంలో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కన్నడ , తమిళ భాషల్లో వచ్చిన అవకాశాలను చేజిక్కించుకొన్నారు. అనంతరం తన ప్రతిభతో హిందీ ప్రేక్షకులను కూడా ఖరీబ్ ఖరీబ్ సింగిల్ అనే సినిమాతో అలరించేందుకు ప్రయత్నించారు.

నాకు రొమాంటిక్ లైఫ్‌ను లీడ్ చేయడమంటే చాలా ఇష్టం. నేను యాక్టర్లతో రొమాన్స్ చేయలేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో టెక్నిషియన్స్‌తో రొమాన్స్ చేశాను అని ఆమె వెల్లడించారు. నాకు డేటింగ్ యాప్స్‌లో అకౌంట్ కూడా ఉంది. కానీ ఎక్కువగా యాప్‌లో డేటింగ్ కోసం తలదూర్చలేదు. నాకు ప్రేమ, అఫైర్ లాంటి విషయాలపై ఆసక్తి భారీగా ఉంది అని పార్వతి వెల్లడించారు.
నాకు అభిరుచులకు అనుగుణంగా ఎవరైనా ఎదురుపడితే వారితో ప్రేమలో పడాలనే కోరిక ఉంది. అలాంటి వ్యక్తి నాకు తారసపడితే తప్పకుండా ప్రేమిస్తాను. సినిమా పరిశ్రమలోని వ్యక్తులైతే ఇంకా మంచిది. అలాంటి వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు గతంలో కొంతమందితో నాకు రిలేషన్‌షిప్ ఉంది. నా మాజీలతో నేను క్లోజ్‌గా ఉంటాను అని ఆమె వెల్లడించారు.

జీవితంలో కొందరితో రొమాంటిక్ రిలేషన్స్ ఎక్కువ కాలం కొనసాగదు. అంత మాత్రాన వారితో స్నేహాన్ని తెంచుకోలేం. నేను మాత్రం నా మాజీ లవర్స్‌తో సంబంధాలను కొనసాగిస్తాను. కాకపోతే వారితో హద్దు మీరి ప్రవర్తించను. గతంలో చాలా మందితో నాకు అఫైర్లు ఉన్నాయి. ప్రస్తుతం నేను మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో లేను. ఒంటరిగానే ఉంటున్నాను అని ఫిలింఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్వతి చెప్పారు.
పార్వతి విషయానికి వస్తే.. తెలుగులో నాగచైతన్యన నటించిన ధూత వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలాగే ఇటివల తంగలాన్, హర్, హిందీలో కడక్ సింగ్, ఇంగ్లీష్‌లో వండర్ ఉమెన్ లాంటి సినిమాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











