అమ్మ ముందే లైంగిక వేధింపులు... చేదు అనుభవాన్ని బయటపెట్టిన యువ హీరోయిన్

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తాము అనుభవించిన బాధలను పలువురు హీరోయిన్లు, మహిళ నటులు బయటపెడుతూనే ఉన్నారు. అయితే నటనా రంగంలోకి రావడానికి ముందే తాము లైంగిక వేధింపులకు గురైనట్లు పలువురు తెలిపారు. సొంత కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, తెలిసినవారి చేతుల్లోనే అత్యాచారానికి, వేధింపులకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో హీరోయిన్ చేరారు. ఈ వివరాల్లోకి వెళితే..

విలక్షణ నటిగా గుర్తింపు
విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు పార్వతి తిరువోత్. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో వినూత్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2006లో ఔట్ ఆఫ్ సిలబస్ మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన పార్వతి ఆ తర్వాత నోట్‌బుక్, వినోదయాత్ర, ఫ్లాష్, సిటీ ఆఫ్ గాడ్, బెంగళూరు డేస్, ఛార్లీ, టేకాఫ్ తదితర చిత్రాల్లో నటించారు. 2018 నుంచి ఆమె తన కెరీర్‌లో పీక్స్‌ను చూశారు. మలయాళం, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషలలో నటించారు. విక్రమ్ సరసన తంగలాన్‌లో పార్వతి నటనకు ప్రశంసలు దక్కాయి. గతేడాది ఆమె నటించిన ఏ చిత్రం విడుదల కాలేదు. ఈ ఏడాది ప్రథమ ద్రిష్ట్య కుటక్కర్, ఐ నోబడీ సినిమాలలో నటిస్తున్నారు పార్వతి.

Parvathy Thiruvothu Opens Up About horrifying incident in Childhood and Industry Struggles

ఏకంగా మమ్ముట్టిపైనే వ్యాఖ్యలు
విషయం ఏదైనా దాపరికం లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడగలిగే అతికొద్దిమంది హీరోయిన్లలో పార్వతి తిరువోతు కూడా ఒకరు. తను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెబుతారు. ఏకంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టినే టార్గెట్ చేస్తూ ఆయన నటించిన సినిమాపై వ్యాఖ్యలు చేసింది. అలాగే మలయాళ చిత్ర పరిశ్రమలో ఎవరైనా ముక్కుసూటిగా మాట్లాడితే వారికి మతిస్థిమితం లేదని ముద్ర వేస్తున్నారని, నాకు నిజాలు మాట్లాడటం అలవాటని పార్వతి వ్యాఖ్యానించారు. అందుకే ఇండస్ట్రీలో ఇబ్బందులకు గురయ్యానని పార్వతి తెలిపారు.

నా ఛాతీపై బలంగా కొట్టి
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురైనట్లు బయటపెట్టి కలకలం రేపారు పార్వతి తిరువోతు. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి రైల్వేస్టేషన్‌కు వెళ్లగా... ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి నా ఛాతీపై బలంగా కొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో మానసికంగా చాలా కుంగిపోయా... దాంతో బయటకు వెళ్లినప్పుడు నన్ను నేను ఎలా రక్షించుకోవాలో? మగాళ్ల చూపులు, చేతలను బట్టి ఎలా నడుచుకోవాలనే దానిపై అమ్మ చెప్పేది. ఓ కన్నతల్లి కూతురికి ఇలాంటి విషయాలు నేర్పించాల్సి రావడం దురదృష్టకరమని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేమిస్తే ఆ పనికి ఒప్పుకోవాలా?
ఇదొక్కటే కాదు.. పెరిగి పెద్దయ్యే దశలో పలుమార్లు నేను లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నా. కొందరు పురుషులు వారి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యకరమైన సైగలు, మాటలు మాట్లాడిన ఘటనలు కూడా ఉన్నాయి. స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు ఓ వ్యక్తిని ప్రాణంగా ప్రేమించా.. ఆ వ్యక్తి ఓ రోజున నన్ను జన సంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఎంత ప్రేమిస్తే మాత్రం.. నా అంగీకారం లేకుండా అలాంటి పనులకు ఒప్పుకోవాలా? అని పార్వతి తిరువోతు ప్రశ్నించారు. ఓ వ్యక్తి లిఫ్ట్‌లో తన ప్రైవేట్ పార్ట్స్ నాకు తగిలేలా ప్రవర్తించడంతో లాగిపెట్టి కొట్టా.. పోలీసులను పిలిచి అప్పగించబోతుండగా అతని పరిస్ధితి చూసి వదిలేశానని ఆమె తెలిపారు. ప్రస్తుతం పార్వతి తిరువోతు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: parvathy thiruvothu movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X