సీఎం అని అరవడం కాదు, వెళ్లి ఓటు గుద్దాలి: మెగాడాటర్ నిహారిక
నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ' సూర్యకాంతం' చిత్రం మార్చి 29 న విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడ్డ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా చిత్ర బృందం ఇటీవల ఓ కాలేజీకి వెళ్లిన విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిహారిక తన సినిమా గురించి మాట్లాడుతుంటే పవర్ స్టార్ గురించి నినాదాలు చేస్తూ అడ్డు పడ్డారు.

సీఎం కాదు.. పీఎం కూడా అవుతాడు
'సూర్యకాంతం' సినిమా గురించిన విశేషాలు చెబుతుంటే... కొందరు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేశారు. వారు గోల చేస్తుంటే నిహారిక రియాక్ట్ అవుతూ.. ‘మీరు ఓట్లు వేస్తే సీఎం కాదు.. పీఎం కూడా అవుతాడు.' అంటూ సమాధానం ఇచ్చింది.

ఊరికే అరవడం కాదు.. ఓటు గుద్దాలి
పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూ గోల చేస్తున్న ఫ్యాన్స్ ఎంతకీ తగ్గక పోవడంతో.... ‘ఏదైనా అంటే నిజంగా చేయాలి.. ఊరికే అరవడం వల్ల ఏమీ జరుగదు. వెళ్లి ఓటు గుద్దితేనే సీఎం అవుతాడు.' అని నిహారిక వారికి సూచించారు. ఈ సందర్భంగా ఆమె అభిమానుల కోరిక మేరకు ‘ఖుషి' మూవీలోని డైలాగ్ చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో నిహారిక పాల్గొంటారా?
నిహారిక తండ్రి నాగబాబు జనసేన పార్టీలో చేరడంతో పాటు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి తన సినిమా విడుదల తర్వాత నిహారిక తండ్రి తరుపున కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? ఏమో... చూడాలి.

సూర్యకాంతం
వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బేనర్లో సందీప్ యర్రంశెట్టి, సృజన్ ఎరబోలు, రామ్ నరేష్ ‘సూర్యకాంతం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని మార్చి 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











