పవన్ హీరోయిన్ తండ్రిని కత్తులతో బెదిరించి దోపిడి.. వివాదంలోకి ప్రియాంక చోప్రా

తెలుగు, హిందీ హీరోయిన్ మీరా చోప్రా కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. తన తండ్రిని కత్తులతో బెదిరించి దోచుకెళ్లడంపై ఆమె షాక్ గురైంది. ఢిలీలో జరిగిన ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. అయితే తన తండ్రి దోపిడికి గురైతే ఈ వ్యవహారంలో తన సోదరి ప్రియాంక చోప్రాను మీడియా లాగడంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాకు మీరా చోప్రా సోదరి అనే విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

మీరా చోప్రా తండ్రిని కత్తులతో

మీరా చోప్రా తండ్రిని కత్తులతో

మీరా చోప్రా తెలిపిన ప్రకారం.. తన తండ్రి ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో నడచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే ఇద్దరు స్కూటర్‌పై వ్యక్తులు వచ్చి కత్తులతో బెరించారు. ఆ తర్వాత తన వద్ద ఉన్న డబ్బు, మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని వెళ్లారు. ఈ ఘటనపై మోడల్ టౌన్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

నా తండ్రికి ప్రాణగండం తప్పింది

నా తండ్రికి ప్రాణగండం తప్పింది

నా ఫాదర్‌కు ప్రాణ గండం తప్పింది. ఇద్దరు వ్యక్తుల కత్తులతో బెదిరించి కొంత మొత్తాన్ని, ఫోన్‌ను తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే ఢిల్లీలో భద్రత ఎంత అనే సందేహం వ్యక్తమవుతున్నది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సీఎం కేజ్రీవాల్, పోలీస్ కమిషనర్ ఢిల్లీకి ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేశారు.

మీరా చోప్రా ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు

మీరా చోప్రా ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు

మీరా చోప్రా ఫిర్యాదుపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్పందించారు. మీకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇవ్వాలని, ఫోన్ నెంబర్ కూడా పంపాలని కోరారు. అందుకు మీరా చోప్రా.. ఎఫ్ఐఆర్ నంబర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అలాగే తన ఫోన్ నంబర్‌ను ఈ మెయిల్ గానీ, మొబైల్ ద్వారా మెసేజ్ చేస్తానని చెప్పారు.

మీరా చోప్రా తండ్రి దోపిడికి గురయ్యారనే వార్తతో

మీరా చోప్రా తండ్రి దోపిడికి గురయ్యారనే వార్తతో

మీరా చోప్రా తండ్రి దోపిడికి గురయ్యారనే వార్త బయటకు రాగానే టెలివిజన్ ఛానెల్స్, ఇతర వెబ్ మీడియా బ్రేకింగులతో హోరెత్తించాయి. అయితే ప్రియాంక చోప్రా చిన్నాన్న కావడంతో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ప్రియాంక చోప్రా పేరును వాడటంపై మీరా చోప్రా అసహనం వ్యక్తం చేశారు. నా తండ్రి చోరికి గురైతే ప్రియాంక చోప్రా పేరు ఎందుకు వాడుతున్నారు అంటూ మండిపడ్డారు.

Recommended Video

Krrish 4 To Be a Multi Starrer Targets RRR Movie
మీరా చోప్రా కెరీర్ ఇలా

మీరా చోప్రా కెరీర్ ఇలా

మీరా చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా సోదరిగా సినీ పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ అంతగా నిలదొక్కులేకోపోయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం దక్కిన ఆఫర్లను క్కించుకోలేకోపొయింది. తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకు వీరుడు, మొగిలిపువ్వు లాంటి చిత్రాల్లో నటించింది. ఇంకా హిందీ చిత్రం సెక్షన్ 375, గ్యాంగ్స్ ఆఫ్ గోస్ట్స్ చిత్రాల్లోనూ, పలు తమిళ చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X