నా చేతుల్లో ఏం లేదు... నొప్పి భరించాల్సిందేనంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టీవ్ అవుతున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రేణు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తాజాగా 26 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
బద్రీ సమయంలో పవన్‌తో పరిచయం
బద్రీ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌లు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ఇద్దరు డేటింగ్ చేసిన అనంతరం వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అకీరా నందన్, ఆద్య కొణిదెల సంతానం. ఈ క్రమంలో రేణు- పవన్‌లు పరస్పర అంగీకారంతో విడిపోయారు. నాటి నుంచి హైదరాబాద్‌కు దూరంగా పిల్లలతో కలిసి ఉంటున్నారు రేణు దేశాయ్. వారి కోసం తన కెరీర్‌ను కూడా వదులుకుని ఒంటరి మహిళగా జీవిస్తున్నారు. పలు సందర్భాల్లో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ వాటికి ఆమె ఖండించారు.

అకీరా లాంచింగ్ కోసం ప్లానింగ్
స్వతహాగా జంతు ప్రేమికురాలు కావడంతో ఓ ఎన్జీవోను స్థాపించిన రేణు దేశాయ్.. మూగ జీవాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అకీరా నందన్, ఆద్యలు పెరిగి పెద్దవారు కావడంతో రేణు దేశాయ్ వారిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే పనుల్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అకీరా నందన్ ఇప్పటికే నటన, సంగీతం, డ్యాన్స్ ఇలా అన్ని రకాలుగా శిక్షణ తీసుకుని లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వారసుడిని సరైన టైంలో ఇండస్ట్రీలో పరిచయం చేయాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.
కొత్త సినిమాకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్
దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్స్ స్టార్ట్ చేశారు రేణు దేశాయ్. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఆ తర్వాత రేణు దేశాయ్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకట్టారు. అయితే వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించారు. తన ప్రాధాన్యత, కథను బట్టి మంచి సినిమాలు ఎంచుకుంటానని రేణు తెలిపారు. దీనిలో భాగంగా పదహారు రోజుల పండుగ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో తాను నటిస్తున్నట్లు రేణు దేశాయ్ ప్రకటించారు. సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఉద్యన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, కృష్ణుడు, విష్ణు తదితరులు ఇతర పాత్రల్లో పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్‌పై సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది.
ఫ్యాషన్ షోలో రేణు దేశాయ్ తళుకులు
ఇదిలాఉండగా రేణు దేశాయ్ హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసి షాకిచ్చారు. బంజారాహిల్స్ లోని పార్క్‌హయత్ హోటల్‌లో హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా దేశంలోని ప్రముఖ డిజైనర్స్ రూపొందించిన దుస్తులను మోడల్స్ ర్యాంప్‌పై ప్రదర్శించారు. ఈ కార్య్రమంలో రేణు దేశాయ్‌తో పాటు అనన్య నాగళ్ల, బిగ్‌బాస్ కౌశల్ మందా, రితికా నాయక్, రుహాణి శర్మ, ఈషా గుప్తా తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రేణు దేశాయ్.
26 ఏళ్ల తర్వాత ర్యాంప్ వాక్
దాదాపు 26 ఏళ్ల తర్వాత XITI weaves కోసం ర్యాంప్‌పై నడిచేందుకు వేదికపైకి వెళ్లడానికి 10 నిమిషాల ముందు నా పర్సనల్ మేకప్‌మెన్ ఇనుప స్టాండ్ మీది నుంచి జారిపడ్డాడు. బరువైన వస్తువు అతని తలను తాకింది. ఆ క్షణంలో నాకు చుక్కలు కనిపించాయి. అతని పరిస్ధితి తలచుకుని నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో షో ప్రారంభం కావడంతో నేను ఏం చేయలేకపోయా, ఆ నొప్పిని భరిస్తూనే వాక్ చేయాల్సి వచ్చింది. నా కళ్లను గమనించినట్లయితే కళ్లుగా ఎర్రగా నీటితో నిండి ఉంటాయి. నేను ప్రస్తుతం చాలా బాధలో ఉన్నాను.. షోలో గందరగోళం లేకుండా ఉండటానికి నా వంతు ప్రయత్నం చేశాను. దీనిని వ్యక్తిగత కారణాల వల్ల పంచుకోవడం లేవు. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎలాంటి బాధను అనుభవిస్తున్నాడో, తన పరిస్ధితిని కొనసాగించడానికి ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలియదు. అందుకే తోటివారి పట్ల మరింత దయతో ఉండాలి అని రేణు దేశాయ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఫ్యాషన్ షోలో రేణు దేశాయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











