ఆయన పిలిస్తే అన్ని వదిలి వచ్చేస్తా... రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
సినిమాలలో నటించినా, నటించకున్నా తిరుగులేని ఫాలోయింగ్‌తో దూసుకెళ్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్. ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలోనూ రేణుని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగా ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 1.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే రేణు దేశాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
పవన్‌తో పెళ్లి, విడాకులు
బద్రీ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడ్డారు రేణు దేశాయ్. ఇద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ కొద్దిరోజులకే పవన్ - రేణులు పరస్పర అంగీకారంతో విడిపోయారు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక పిల్లలు అకీరా నందన్, ఆద్యలే లోకంగా బతుకుతున్నారు రేణు. ఒంటరి మహిళగా వారిని పెంచి పెద్ద చేసిన రేణు.. వారి లాంచింగ్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.

అకీరా లాంచింగ్‌పై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయినప్పటికీ ఆయనంటే ఎంతో గౌరవం, అభిమానం. వీలున్నప్పుడల్లా పవన్ గొప్పదనం గురించి పలుమార్లు చెబుతూనే ఉంటారు. అటు పవన్ కూడా తన మాజీ భార్య, పిల్లల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ వెంటే ఉంటున్నారు అకీరా, ఆరాధ్య. దాంతో అకీరా లాంచింగ్ ఎప్పుడు? ఆయనను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరు? అంటూ పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క సినిమా కూడా చేయకుండానే అకీరాకు భారీ క్రేజ్ ఉంది.
20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ
పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. దాదాపు 20 ఏళ్ల తర్వాత రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించారు. సామాజికవేత్త హేమలతా లవణం పాత్రని ఆమె పోషించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో రేణు దేశాయ్ కొత్తగా ఏ సినిమాకు ఓకె చెప్పలేదు. అయితే తనను నటించాల్సిందిగా పలువురు ఒత్తిడి చేస్తున్నారని, ఎన్నో గొప్ప పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయని రేణు పలుమార్లు తెలిపారు. అయితే ఓ సినిమాలో అత్తగారి రోల్‌లో నటించేందుకు ఓకే చేసినట్లుగా ఆమె గతంలో బయటపెట్టారు. అది ఏ సినిమా? హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? అనేది మాత్రం రేణు దేశాయ్ క్లారిటీ ఇవ్వలేదు.
సన్యాసంపై వ్యాఖ్యలు
ఇక భారతదేశ ఆచారాలు, సాంప్రదాయాలకు రేణు దేశాయ్ అత్యంత విలువనిస్తారు. ఇంట్లో అన్ని పండుగలు జరుపుకోవడంతో పాటు పిల్లలకు కూడా వాటి విలువను తెలియజేస్తూ చాలా పద్ధతిగా పెంచారు. తరచుగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు పిల్లలను కూడా అక్కడికి తీసుకెళ్తారు. తొలి నుంచి ఆధ్యాత్మిక రంగంపై రేణుకి ఆసక్తి ఎక్కువ. తన బాధ్యతలు అన్నింటిని నెరవేర్చి భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని ఆమె చెప్పడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఆయన పిలిస్తే వెళ్లాల్సిందే
కాశీ క్షేత్ర పాలకుడు కాల భైరవుడి జయంతి కావడంతో దర్శనం చేసుకున్న అనంతరం.. కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరకూడదు, మనమే రక్షకుడిగా మారాలి. కాల భైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరమేశ్వరుడు పిలిచినప్పుడు మీరు అన్ని వదిలేసి కాశీ వెళ్తారని రాసుకొచ్చారు రేణు దేశాయ్. దీంతో రేణు గతంలో సన్యాసంపై చేసిన వ్యాఖ్యలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











