పవర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్రవాదులను మించి.. పవన్ కళ్యాణ్ గురించి యాంకర్ స్రవంతి స్వీట్ మెమొరీస్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఒకవైపు నటుడిగా వెండితెరపై అశేష ప్రేక్షకాభిమానం, మరోవైపు రాజకీయ నాయకుడిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు.. ఈ రెండు పాత్రలను సమర్థ వంతంగా పోషిస్తున్నారు.ఇక పవన్ పై తన అభిమానులు ఏ స్థాయిలో అభిమానం చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ, పవన్ కల్యాణ్‌కి మాత్రం భక్తులు ఉంటారంటూ ఒక టాక్ ఉంది. ఆయన కనిపిస్తే చాలు.. వారి అభిమానం ఒక్కోసారి హద్దులు దాటిపోతోంది. ఇలాంటి అభిమానులపై తాజాగా యాంకర్‌ కమ్‌ ఆర్టిస్ట్‌ స్రవంతి చొక్కారపు (Sravanthi Chokkarapu)ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలేంటీ?

యాంకర్‌ కమ్‌ ఆర్టిస్ట్‌ స్రవంతి చొక్కారపు (Sravanthi Chokkarapu). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర చానల్స్‌లో ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్‌గా కొనసాగుతూనే.. మరోవైపు పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు వరుస కార్యక్రమాలతో దూసుకెళ్తున్న ఈ లేడీ యాంకర్, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది. ఇదిలా ఉండగా, తాజాగా ఆమె వెండితెరపై కూడా అడుగుపెట్టబోతోంది. హే భగవాన్ (Hey Bhagavan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా..ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.

Pawan Kalyan Fans Like Hardcore Devotees Anchor Sravanthi Chokkarapu s Viral Comments

హే భగవాన్ (Hey Bhagavan) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్రవంతి చొక్కారపు ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను నటిస్తున్న హే భగవాన్ షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల పవన్ నటించిన ఓజీ (OG)మూవీ ఈవెంట్‌కు వెళ్లలేకపోయానని, అదే విషయం తనను చాలా బాధ పెట్టిందని వెల్లడించింది. 'ఎన్నో రోజులుగా పవన్ గారిని చూడాలని ఎదురుచూస్తున్నాను. అదే సమయంలో OG ఈవెంట్ రావడం, షూటింగ్ కారణంగా మిస్ అవ్వడం చాలా ఫీల్ అయ్యా. నిజానికి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్‌గా కూడా చూడలేదు... దూరం నుంచైనా చూడలేకపోయాను' అంటూ బాధపడింది.

'ఖుషి' నుంచే పవన్ ఫ్యాన్...
ఎప్పటి నుంచి మీరు పవన్ కళ్యాన్ ఫ్యాన్?' అని ప్రశ్నించగా.. 'ఖుషి సినిమా నుంచే పవన్ గారిపై తెలియని ఇష్టం మొదలైంది. ఆయన వేసుకునే టీషర్ట్స్, జీన్స్, క్యాప్స్ అంటే చాలా ఇష్టం. ఖుషి తర్వాత ఆయన వేసుకున్న గ్రీన్ కలర్ హూడీ కూడా కొనుక్కున్నాను. ఇప్పటికీ నా దగ్గరే ఉంది. న్యూస్‌పేపర్‌లో పవన్ ఫోటో వస్తే కట్ చేసి బుక్స్‌లో అంటించుకునేదాన్ని. ఆయన వేసుకునే చైన్స్, టీషర్ట్స్ కలెక్ట్ చేసుకోవడం నాకు అలవాటే' అంటూ తన ఫ్యాన్‌గర్ల్ స్టోరీ చెప్పుకొచ్చింది. 'ఒకవేళ పవన్ గారిని ఎదురుగా చూస్తే..మాట్లాడకుండా సైలెంట్‌గా నిలబడిపోతాను' అంటూ నవ్వుతూ చెప్పిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంకా ఆమె మాట్లాడుతూ, 'హరిహర వీరమల్లు' ఈవెంట్ సమయంలో పవన్‌ను కలుస్తానని ఆశించానని, కానీ, అది కూడా కుదరలేదని చెప్పింది. అయితే, 'పవన్ గారి సినిమా కోసం నేను పని చేస్తున్నాను అన్న ఫీలింగ్ మాత్రం చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అదో సాటిస్‌ఫాక్షన్, అదో ఎనర్జీ' అంటూ ఎమోషనల్ అయ్యింది. పవన్ సినిమాల్లో తనకు ఎక్కువసార్లు చూసిన మూవీ అత్తారింటికి దారేది సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని, ఆ తర్వాత ఖుషి బంగారం, గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలను ఎన్నిసార్లు చూసానో లెక్క లేదంటోంది.

పారిస్‌లో షాకింగ్ అనుభవం!
ఇటీవల OG సినిమాను పారిస్‌లో చూసిన అనుభవాన్ని కూడా పంచుకుంది. ' పారిస్ లో ఉన్న పవన్ అభిమానులు నిజంగా డైహార్ట్ ఫ్యాన్స్. అందరూ పవన్ కోసం ఏమైనా చేసే టైప్. ఒక మాటలో చెప్పాలంటే.. కరుడుగట్టిన తీవ్రవాదుల కంటే ఎక్కువ అనిపించారు! వాళ్ల మధ్య కూర్చుని సినిమా చూస్తుంటే ఇండియాలోనే ఉన్నట్టు ఫీల్ వచ్చింది. పారిస్‌లో తెలుగు వాళ్ల హంగామా మామూలుగా లేదు'అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇలా పవన్ కళ్యాణ్‌పై ఈ లేడీ యాంకర్ చూపించిన ప్యాషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X