Ameesha Patel: ఆ హీరోతో నా పెళ్లైపోయింది.. 48ఏళ్ల వయసులో షాకింగ్ సీక్రెట్ రివిల్ చేసిన అమీషా పటేల్
హాట్ బ్యూటీ అమీషా పటేల్.. బాలీవుడ్ వారితో పాటు తెలుగు సినీ అభిమానులకు బాగానే పరిచయం. బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర లాంటి చిత్రాల్లో నటించి తెలుగువారికి దగ్గరైంది. ఆ తర్వాత బాలీవుడ్లో సెటిల్ అయిపోయింది. అయితే ఈ అమ్మడుకు వయసు 48 ఉంటుంది. అయినా ఇప్పటికీ హాట్ హాట్‌గా అందాల ఆరబోత చేస్తుంది కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. పెళ్లి జరిగిపోయిందని చెప్పింది. మరి ఇంతకీ ఎవరితో ఆ పెళ్లి జరిగింది? ఎవరితో జరిగింది? వంటి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా: బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పవన్ కల్యాణ్‌తో బద్రి, మహేశ్ బాబుతో నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడు వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో అక్కడే పాగా వేసింది. సన్నీ దేఓల్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించి పెద్ద హీరోయిన్గా ఎదిగింది. ఎన్నో హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకుంది.

ఎక్స్పోజింగ్ పిక్స్‌తో దిమాఖ్ కరాబ్: అలా దాదాపు పదేళ్ల వరకు కెరీర్‌ను బాగానే రాణించింది. అనంతరం ఏమైందో తెలీదు కానీ కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ హద్దులు మీరి మరీ అందాలను ప్రదర్శించింది. ఎక్స్పోజింగ్ పిక్స్‌తో యూత్ దిమాఖ్ను కరాబ్ చేసింది. ఎక్కువగా ఎద అందాలను ఆరబోస్తూ హీటెక్కించింది. దీంతో అందరూ షాక్ అయిపోయారు. అలా నెటిజన్లుతో, తన అభిమానులతో టచ్‌లో ఉంది.

గదర్ సినిమా సీక్వెల్‌తో రీఎంట్రీ: మరోవైపు ఈ ముద్దుగుమ్మ పలు కాంట్రవర్సీల్లోనూ నిలిచింది. ఇకపోతే మళ్లీ గత కొంతకాలంగా అడపా దడపా ఎక్కడో ఓ చోట కనిపిస్తూ మెరుస్తోంది అమీషా. కానీ తెరపై మాత్రం సందడి చేయలేదు. అయితే రీసెంట్గా మళ్లీ తన కెరీర్ ప్రారంభంలో భారీ హిట్ అందించిన గదర్ సినిమా సీక్వెల్‌తో రీఎంట్రీ ఇచ్చింది. మరో సూపర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. దీంతో మళ్లీ ఆమె కెరీర్ యాక్టివ్‌లోకి వచ్చింది. అయితే ఈ భామకు 48 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఐదు పదుల వయస్సులోనూ అందాలను భారీగా చూపిస్తూ ముందుకెళ్తోంది.

పెళ్లి గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్: అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీషా పటేల్ తన పెళ్లి గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది. తనకు పెళ్లి అయిపోయిందని చెప్పింది. రియల్ లైఫ్‌లో పెళ్లి కాకపోయినా ఓ వ్యక్తిని భర్తగా ఊహించుకుంటున్నాను. నాకు హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం. అతడికే నా జీవితాన్ని అంకితం చేస్తాను. నా మనసులో టామ్‌ను భర్తగా అంగీకరించాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. దీని గురించి నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











