వీకెండ్ మోటివేషన్.. ఫిట్ నెస్ పై పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫోకస్..

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండాలంటే హీరోలకు హిట్లు కావాలి.. హీరోయిన్స్ అందంతో పాటు అట్రాక్ట్ చేసే ఫిట్ నెస్ ఉండాలి. ఫిట్ సెన్ విషయంలో ఎవరైతే.. అప్డేట్ గా ఉంటారో.. వారే అవకాశాలను అందుకుంటున్నారు. లేదంటే.. అవుట్ డేటేడ్ అవుతారు. అందుకే స్టార్ హీరోయిన్స్ మెయిన్ గా తమ ఫిట్ సెన్ పై ఫోకస్ చేస్తారు. వారి డైలీ రోటీన్ లో జిమ్, వర్కౌట్స్ తప్పనిసరిగా మార్చుకుంటారు. ఎప్పుడూ ఫిట్ గా కనిపించేందుకు హీరోయిన్స్ జిమ్ ల్లో చెమటలు తీస్తారనే విషయం తెలిసిందే. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ కూడా స్టార్ట్ హీరోయిన్ బాటలో నడుస్తోంది. వీకెండ్ మోటివేషన్ అంటూ.. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)'వకీల్ సాబ్'ఫేమ్ అనన్య నాగళ్ల (Ananya Nagalla). అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ మీద ఇంట్రెస్టింగ్ తో యాక్టింగ్ క్లాసులకు వెళ్లింది. ఈ తరుణంలోనే.. 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా వచ్చింది. ఇందులో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. అలాగే.. 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో ఆమెకు సైమా అవార్డు వచ్చింది. ఈ పాపులరిటీతో 'మల్లేశం' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది అనన్య. ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

Pawan Kalyan heroine Ananya Nagalla shares Her Fitness Secret video viral

ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. తన నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వచ్చాయి. అలా 'ప్లేబ్యాక్', 'మ్యాస్ట్రో', 'ఊర్వసివో రాక్షశివో', 'శాకుంతలం', 'మళ్లీ పెళ్లి', 'తంత్ర', 'డార్లింగ్' అనే చిత్రాల్లోనూ సందడి చేసింది. ఇలా పలు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతుంది.

రిసెంట్ గా 'పొట్టేల్' అనే సినిమాలో హీరోయిన్ గా నటించి.. మెప్పించింది. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. రీసెంట్‌గా ఈ సినిమాలో అనన్య నాగళ్ల కు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

Pawan Kalyan heroine Ananya Nagalla shares Her Fitness Secret video viral

ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలను, పర్సనల్ విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. అలా తాజాగా ఈ అమ్మడు వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల .. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు తన జిమ్ ట్రైనర్‌ సమక్షంలో ట్రైనింగ్ తీసుకుంటుంది. కిక్ బ్యాగ్ ను కాళ్ళతో గట్టిగా తనడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ అంటూ.. నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియో ను లుక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X