5 ఏళ్లుగా సీక్రెట్​ డేటింగ్​.. పెళ్లైన హీరోతో ఏడడుగులు వేయనున్న పవన్ కల్యాణ్ హీరోయిన్​!

ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు వంటివి రెగ్యులర్​గా వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి అనగానే ఎక్కడ లేని ఆసక్తి చాలా మందిలో నెలకొంటుంటుంది. వారు ఎవరితో రిలేషన్​షిప్​లో ఉన్నారు? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు?, ఎప్పుడు చేసుకుంటున్నారు? వంటి రూమర్స్ ఎప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే తాజాగా నిజంగానే ఓ హీరోయిన్​ పెళ్లి పీటలెక్కబోతుంది. అది కూడా ఓ హీరోకు రెండో భార్యగా. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏ హీరోను పెళ్లి చేసుకోబోతుంది? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు చిత్రసీమలో అందం, అభినయం ఉన్న కథానాయికల్లో కృతి కర్బంద ఒకరు. మోడల్​గా కెరీర్ ప్రారంభించిన ఈ దిల్లీ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడలోనూ పలు సినిమాలు చేసింది. బోణీ చిత్రంతో టాలీవుడ్​ సిల్వర్ స్క్రీన్​కు పరిచయమైందీ ముద్దుగుమ్మ. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అలా మొదలైంది, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, త్రీడీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించే ప్రయత్నం చేసింది. పవన్ కల్యాణ్ తో కలిసి తీన్​మార్​ చిత్రంలో నటించింది. కానీ స్టార్ హీరోయిన్​గా మాత్రం ఎదగలేకపోయింది. చివరసారిగా 2015లో వచ్చిన బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్‌కు అక్కగా నటించి మెప్పించింది.

Pawan Kalyan Heroine Kriti Kharbanda is getting married News Goes Viral

అనంతరం టాలీవుడ్​కు దూరమైపోయింది కృతి. బాలీవుడ్​కు మకాం మార్చేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేయడం ప్రారంభించింది. అలా అక్కడే ఉంటూ కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్​తో డేటింగ్ కూడా చేస్తోంది. చాలా సార్లు వీరికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడీ ఈమె అతడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్​గా వీరి నిశ్చితార్థంకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ అఫీషియల్​గా మాత్రం పోస్ట్ చేయలేదు.

ఇరువురి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య కృతి - పుల్కిత్ నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. కృతి, పుల్కిత్ చేతికి ఒకే రకమైన ఉంగరాలు కనపడటం, అలాగే ఆ పిక్స్​లో ఇల్లంతా ఎంతో అందంగా అలంకరించినట్లుగా కూడా కనిపించింది. అదీ ఈ పిక్స్​ను పుల్కిత్ మాత్రమే తన ఇన్​స్టాలో పంచుకున్నారు.

ఇక తాజాగా వాలంటైన్స్​ డే సందర్భంగా కృతి తన రిలేషన్​షిప్​కు సంబంధించి ఓ పోస్ట్ చేసింది. తన లవర్​ పుల్కిత్​తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. లెట్స్ 'మార్చ్' టుగెదర్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ జంట ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అర్థమైంది. అయితే మ్యారేజ్​ డేట్​పై క్లారిటీ రాలేదు. అలానే తనకు కాబోయే పార్ట్నర్​కు వాలంటైన్స్ డే విషెస్ కూడా తెలిపింది కృతి.

Pawan Kalyan Heroine Kriti Kharbanda is getting married News Goes Viral

ఇకపోతే గతంలో 2014లో పుల్కిత్ సామ్రాట్ గతంలో శ్వేతా రోహిరాను పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థల వల్ల ఏడాది తిరక్కుండానే 2015లో విడాకులు తీసుకున్నారు. ఇక పుల్కిత్ 2019 నుంచి కృతితో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరు కలిసి పాగల్ పంటి, వీరే ది వెడ్డింగ్, తైష్ చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పుల్కిత్ చివరిగా ఫక్రీ 3లో కనిపించారు. ప్రస్తుతం రిస్కీ రోమియో అనే చిత్రంలో నటిస్తున్నారు. చూడాలి మరి ఈ కపుల్ ఇంట్లో పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X