40ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన పవన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?
హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఈ బ్యూటీ 40 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధం అయింది. తన పెళ్లి గురించి మీరా చోప్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంగారం చిత్రంలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ వరుసగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తోంది. మీరా చోప్రా తరచుగా సోషల్ మీడియాలో ఇండియాలో హైలైట్ అవుతున్న పొలిటికల్ టాపిక్స్ పై తన అభిప్రాయాలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.

మీరా చోప్రా ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలబడలేకపోయినా.. తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికి మీరా చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన అందచందాలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక నాలుగు పదుల వయసు వచ్చినా మీరా చోప్రా ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదనే విషయం తెలిసిందే.
అయితే ఎట్టకేలకు మీరా చోప్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా చెప్పుకువచ్చింది. ప్రస్తుతం మీరా చోప్రా బాలీవుడ్ లో సఫేద్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరా చోప్రా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. మీరా చోప్రా.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకి కజిన్ సిస్టర్.
ఇక మీరా చోప్రా తన పెళ్లి 2024 ఫిబ్రవరిలో జరగబోతున్నట్లు ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. తన కుటుంబ సభ్యులు ఆల్రెడీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పుకువచ్చింది. అయితే తనకి కాబోయే భర్త వివరాలు బయటపెట్టేందుకు మాత్రం ఇష్టపడలేదు ఈ బ్యూటీ. తన వివాహం రాజస్థాన్ లో జరగనుందని తెలుస్తోంది. దాదాపు 150 మంది గెస్ట్ లని ఇన్వైట్ చేయబోతున్నట్లు మీరా చోప్రా చెప్పుకువచ్చింది.

ఇక రిసెప్షన్ మాత్రం ముంబైలో నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఇటీవల మీరా చోప్రా ఓ మిస్టరీ వ్యక్తితో క్రిస్టమస్ ని సెలెబ్రేట్ చేసుకోగా... ఆ ఫోటోకి ప్యార్ వాలా క్రిస్టమస్ అని కూడా క్యాప్షన్ రాసుకువచ్చింది. బహుశా అతడే మీరా చోప్రాకి కాబోయే భర్త అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.


Click it and Unblock the Notifications










