పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మూవీ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన మరో సెన్సేషనల్ బ్యూటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న వినోదాయ సీతం రీమేక్ సినిమా మొత్తానికి మొదలైంది. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టు గురించి అనేక రకాల కథనాలు అయితే వెలబడుతున్నాయి. బుధవారం రోజు అధికారికంగా సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా గురువారం నుంచి మొదలు పెట్టారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ విషయంలో కూడా దాదాపు అందరూ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే గ్లామరస్ బ్యూటీ కేతిక శర్మ ఇందులో ఒక హీరోయిన్ పాత్రకు సెలెక్ట్ అయినట్లు టాక్. సాయి ధరమ్ తేజ్ కు జోడిగా ఆమె నటించబోతోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు మాత్రం జోడి లేదు. ఆయన సోలో గానే కనిపించబోతున్నారు.

Pawan kalyan sai dharam tej upcoming movie heroine

అయితే ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కోసం మరో క్యూట్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన వింక్ గల్ ప్రియా ప్రకాష్ వారియర్ ను సెలెక్ట్ చేసుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఈ రీమేక్ సినిమాలు చాలా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇక ఒరిజినల్ తమిళ కథకు తగ్గట్టుగా కాకుండా చాలా మార్పులు చేసి ఈ రీమేక్ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటలు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలైపోయింది. ఇక వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది ఆగస్టులో లేదా అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం 30 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X