twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నికేషా పటేల్ కెరీర్‌ను తొక్కేసిందెవరూ.. బయటపెట్టిన పూనమ్ కౌర్

    |

    Recommended Video

    Nikesha Patel Contraversial Tweet About Pawan Kalyan On His Birthday !

    తెలుగు తెర మీద మెరిసినట్టే మిరిసి మాయమైన హీరోయిన్ నికేషా పటేల్. బ్రిటన్‌లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ నటించిన పులి చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా దక్షిణాదిలో ఆఫర్లు చేజిక్కించుకొంటూ ఓ రేంజ్‌లోకి దూసుకెళ్లింది. తెలుగు, తమిళం, కన్నడ అనే భేదం లేకుండా సినిమాలు చేసింది. అయితే ఉన్నట్టుంది ఆమె కెరీర్‌పై దెబ్బ పడింది. ఇంతకు అలా కనుమరుగు కావడానికి కారణమేమిటంటే..

    నికేషా పటేల్ కొన్నేళ్లుగా దూరం

    నికేషా పటేల్ కొన్నేళ్లుగా దూరం

    టాలీవుడ్‌ను గ్లామర్‌తో మెప్పించిన నికేషా పటేల్ కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కనుమరుగైంది. తనకు తొలి అవకాశం ఇచ్చిన పవన్ కల్యాణ్ తాజా జన్మదినం సందర్భంగా ట్వీట్ చేసి నికేషా వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె చేసిన ట్వీట్ వివాదంగా మారడంతో మళ్లీ నికేషా వార్తల్లో కెక్కారు. తాను చేసిన తప్పుకు బాధపడి ట్వీట్‌ను డిలీట్ చేసింది.

    పవలా కల్యాణ్ అంటూ

    పవలా కల్యాణ్ అంటూ

    పవలా కల్యాణ్ అంటూ ట్వీట్ చేసిన నికేషాపై పవన్ ఫ్యాన్స్, మీడియా విరుచుకుపడింది. దాంతో ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ.. మీడియా, పవన్ ఫ్యాన్స్ సంయమనం పాటించి ట్రోలింగ్ ఆపివేయాలి. నేను చూడకుండా ప్రెస్ చేయడంతో అది ట్రెండింగ్‌గా మారింది. పవన్ కల్యాణ్‌ను హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదంటూ ట్వీట్లు చేసింది.

    నికేషాకు అండగా పూనమ్

    నికేషాకు అండగా పూనమ్

    అయినా నికేషాపై ట్రోల్ ఆగకపోవడంతో ఆమెకు అండగా హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించింది. పవన్ కల్యాణ్ విషయంలో నీవు నీ నిజాయితీ ఏంటో చూపించుకోవాల్సిన అవసరం లేదు. సంయమనం పాటిస్తే సరి. నీ ఇంటర్వ్యూ‌ను మార్చి ఓ జర్నలిస్టు నీ కెరీర్‌ను ఎలా దెబ్బ తీశాడో నీకు, అందరికి తెలుసు. తాజా విషయంలో శాంతంగా ఉండాలి అని సూచించింది.

    ఇంటర్వ్యూ కారణంగానే

    ఇంటర్వ్యూ కారణంగానే

    కాగా నికేషా కెరీర్ మంచి జోరులో ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూ వివాదాస్పదంగా మారింది. నికేషా చేప్పినట్టు వచ్చిన మాటలు ఆమెపై సినీ ప్రముఖులు ఆగ్రహం చెందేలా చేశాయి. దాంతో ఆమెకు అవకాశాలు క్రమేపీ తగ్గాయి. దాంతో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఓ రేంజ్‌ నుంచి క్రమేపీ కిందకు పడిపోయారని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

    English summary
    Actress Nikesha Patel tweet about Pawan Kalyan's birthday become most contraversial. On that inicident, Poonam Kaur reacted and said that, UNikeshapatel don’t have prove your loyalty to people ... just keep quiet ... other wise they will only have fun ... remember your interview was altered by a wicked journalist which affected your career ...have fun ... be at peace...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X