పవన్ కళ్యాణ్ సినిమా కోసం అఖిల్ హీరోయిన్.. కొత్త బ్యూటీకి లక్కీ ఛాన్స్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కొత్త హీరోయిన్స్ కోసం దర్శకులు నిర్మాతలు చాలా మందిని ఆడిషన్స్ చేస్తున్నారు. హీరోయిన్స్ కొరత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సీనియర్ హీరోయిన్స్ చాలా వరకు కూడా ఫామ్ లో లేకపోవడంతో కేవలం కొందరు మాత్రమే వారి హవాను కొనసాగిస్తున్నారు. అయితే వారు కూడా బిజీగా ఉండటం వలన స్టార్ హీరోలు కొత్త హీరోయిన్స్ వైపు ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రొటీన్ గా ఉండకుండా కెమిస్ట్రీ చాలా కొత్తగా ఉండాలని కూడా దర్శకులు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రస్తుతం రాబోయే కొత్త హీరోయిన్స్ కు చాలా మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పవచ్చు. కాస్త అదృష్టం ఉన్నాకూడా నేటి తరం యువ హీరోయిన్స్ దశ ఒక్కసారిగా తిరుగుతుంది అని చెప్పవచ్చు.

అయితే రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాలో కొత్త హీరోయిన్ సెలెక్ట్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. సమ్మర్ లో విడుదల చేయాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ సరికొత్త లైనప్ తో సిద్ధమవుతున్నాడు. దాదాపు ఈ సినిమాలాన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు నటించిన హీరోయిన్స్ తో నటిస్తున్నాడు.

Pawan kalyan upcoming projects with Surender Reddy heroine Sakshi Vaidya finalized

అయితే సురెందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తప్పకుండా ఆ సినిమాలో కూడా కమర్షియల్ అంశాలతో పాటు మంచి సందేశం కూడా ఉంటుందని ఇదివరకే ఒక టాక్ వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కెరీర్ మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మధ్యలో దాదాపు ఒక స్క్రిప్ట్ ఫైనల్ అయ్యింది అని అనుకున్న సమయంలోనే క్యాన్సల్ అయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశంతో ఎలాగైనా మంచి సినిమా చేయాలని సురేందర్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు ఏజెంట్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ సాక్షి వైద్య పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న సాక్షి వైద్య అఖిల్ తో నటించిన విధానం దర్శకుడికి బాగా నచ్చిందట. ముఖ్యంగా ఆమె కొన్ని లవ్ సీన్స్ లో అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. అందుకే దర్శకుడు మరో ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా కోసం కూడా సాక్షిని ఫిక్స్ చేసుకోవాలి అని నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు. ఒకవేళ ఈ బ్యూటీకి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తే కనుక తప్పకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X