twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంతను దీవిస్తున్న పవన్ కళ్యాణ్... పుట్టినరోజు స్పెషల్ ఫొటో వైరల్

    |

    సమంత ఎప్పుడు కనిపించినా కూడా అందరికి జెస్సి అనే పేరే ఎక్కువగా గుర్తొస్తుంది. అంతగా మాయ చేసిన సమంత మొదటి సినిమాతో ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆమె తన గ్లామర్ తో నటనతో ఇంకా 16ఏళ్ళ బ్యూటీలానే దర్శనమిస్తోంది. ఇక నేడు సమంత పుట్టినరోజు కావడంతో ఒక ఫొటో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు సరదాగా ఆ ఫొటోతోనే ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    తెలుగు జెస్సికి భారీ క్రేజ్

    తెలుగు జెస్సికి భారీ క్రేజ్

    గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసేవే సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. ఆ సినిమా మూడు భాషల్లో వచ్చినా కూడా ఎక్కువగా క్రేజ్ అందుకుంది మాత్రమే తెలుగు జెస్సినే. ఇక అక్కినేని వారసుడికి ఆ సినిమాతో మొదటి సక్సెస్ రావడంతో ఆమెనే లక్కీగా లైఫ్ పాట్నర్ గా మార్చేసుకున్నడు.

    టాలెంట్ తో కౌంటర్..

    టాలెంట్ తో కౌంటర్..

    ఇక సమంత పెళ్లి తరువాత కూడా నేటితరం హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్ తో మంచి పోటీని ఇస్తోంది. రెగ్యులర్ గా విభిన్నమైన ఫొటో షూట్స్ తో ఆశ్చర్యపరుస్తోంది. హీరోయిన్స్ కు పెళ్లయితే తొందరగా డౌన్ అయిపోతారు అనే అపోహలకు ఆమె తన టాలెంట్ తో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తోటి నటిమణులకు కూడా ఒక నమ్మకాన్ని ఇచ్చారు.

    లేడి ఓరియెంటెడ్ సినిమాలతో..

    లేడి ఓరియెంటెడ్ సినిమాలతో..

    ఇక ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా సమంత సెలక్టివ్ గా మంచి సినిమాలు చేస్తోంది. పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. యూ టర్న్, ఓ బేబి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఇప్పుడు శాకుంతలంతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

    Recommended Video

    #HappyBirthdaySamanthaAkkineni : Samantha Birthday Special Story | Filmibeat Telugu
    సమంతకు పవన్ ఆశీర్వాదం

    సమంతకు పవన్ ఆశీర్వాదం

    అయితే నేడు సమంత పుట్టినరోజు కావడంతో అగ్ర హీరోల అభిమానుల నుంచి ఆమెకు స్పెషల్ గా విషెస్ అందుతున్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ కూడా ఒక ఫన్నీ ఫొటో ద్వారా విష్ చేస్తున్నారు. సమంత కింద కూర్చొని ఉండగా పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఆశీర్వాదం ఇస్తున్నట్టు స్టిల్ ఇచ్చారు. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ లో ఇలా సరదగా దిగిన ఫొటో నెటిజన్లను ఇప్పుడు అమితంగా ఆకట్టుకుంటోంది.

    English summary
    Pawan kalyan with samantha special birthday photo viral, Samantha continues her stardom as an actress even after Akkineni became their sister-in-law. Most of the heroines usually cut short the movies if they get married. But that was once. Now it is being proved that acting has nothing to do with marriage. Samantha is also continuing her regular life without any changes in the glamor world. And recently Samantha made unexpected comments on the difference in remunerations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X