నా వెనుక ఆయనే.. టచ్ చేయగలరా... రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలోనూ, తన సామాజిక కార్యక్రమాల్లో యాక్టీవ్‌గానే ఉంటున్నారు. పిల్లల బాధ్యతను చూసుకుంటూనే సమాజం కోసం కూడా ఆమె పాటుపడుతున్నారు. తన అభిప్రాయాలు, ఆలోచనలతో పాటు వివిధ అంశాలపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

పిల్లల కోసం సినిమాలకు దూరం
పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత తన పిల్లలు అకీరా నందన్, ఆద్య కొణిదెలల బాధ్యతలు తీసుకున్న రేణు దేశాయ్.. వారి కోసం తన కెరీర్‌నే వదులుకున్నారు. హీరోయిన్‌గా పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. రేణుని తిరిగి నటింపజేయాలని పలువురు సన్నిహితులు కూడా ప్రయత్నించినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్లు కావడంతో వారిని కెరీర్‌లో సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు రేణు.

Pawan Kalyan s Ex wife Renu Desai s Emotional Post on Lord Shiva Goes Viral

అకీరా లాంచింగ్ కోసం వెయిటింగ్
ఇప్పటికే అకీరా నందన్ తండ్రి మాదిరిగానే హ్యాండ్సమ్‌గా తయారయ్యాడు. సంగీతంలో ప్రావీణ్యం సంపాదించిన ఈ కుర్రాడు, డ్యాన్స్, నటన, ఇతర యాక్టింగ్‌కు సంబంధించిన మెళకువలు నేర్చుకుంటున్నాడు. ఒక్క సినిమాలోనూ నటించకుండానే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అకీరా. ఇప్పటికే తన తండ్రి పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ మీడియాకు చిక్కుతున్నాడు. దాంతో ఆయన ఎంట్రీ ఎప్పుడు అంటూ మెగా ఫ్యాన్స్, పవన్ అభిమానుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. సరైన స్క్రిప్ట్, మంచి టైమ్ చూసి అకీరాను గ్రాండ్ లాంచ్ చేయడానికి మెగా ఫ్యామిలీ కసరత్తు చేస్తోందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేణు దేశాయ్ కూడా ఈలోగా కొడుకుని అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు.

కొత్త సినిమాకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్
మరోవైపు.. దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్. ఇందులో సామాజికవేత్త హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ నటించారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె కొంత గ్యాప్ తీసుకున్నారు. అయినప్పటికీ రేణు దేశాయ్‌ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతూనే ఉన్నారు. తాజాగా పదహారు రోజుల పండుగ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో తాను నటిస్తున్నట్లు రేణు దేశాయ్ ప్రకటించారు. సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఉద్యన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో చాలా ఏళ్ల తర్వాత ర్యాంప్ వాక్ చేసి అలరించారు రేణు దేశాయ్.

ఆయనపై రేణు దేశాయ్ పోస్ట్
రేణు దేశాయ్‌కి తొలి నుంచి దైవభక్తి, సంస్కృతి, సాంప్రదాయాల మీద మక్కువ ఎక్కువ. వీలున్నప్పుడల్లా తీర్ధయాత్రలు చేయడంతో పాటు తనకు ఎంతో ఇష్టమైన కాశీకి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుంటూ ఉంటారు. తాజాగా శివుడిపై తన భక్తిని చాటుకుంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నా మనసంతా భావాలతో భారంగా నిండిపోయినప్పుడు, జీవితంలోని భ్రమలు నన్ను కిందకి లాగుతున్నట్లు అనిపించినప్పుడు.. నేను ఆ మహాదేవుడి ఓదార్పును కోరుకుంటాను. ఆయన ఎప్పుడూ నన్ను రక్షిస్తూ, సురక్షితంగా చూసుకుంటారు. హర హర మహాదేవ్ అంటూ రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: pawan kalyan renu desai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X