‘6 ఏళ్ల వయస్సులోనే వేధింపులు.. నాన్న ఫ్రెండే దారుణంగా'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'తమ్ముడు'. ఈ మూవీలో 'లవ్లీ' పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందగత్తె అదితి గోవిత్రికర్. ఈ అమ్మడు తాజాగా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. మోడలింగ్, సినిమాలు, రియాలిటీ షోల ద్వారా పేరు తెచ్చుకున్న ఆమె. తన చిన్ననాటి జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో ధైర్యంగా వెల్లడించారు. ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు
పవన్ కళ్యాణ్ 'తమ్ముడు'తో తెరంగేట్రం చేసిన అదితి, ఆ తర్వాత 'మౌనమేలనోయి'లో స్పెషల్ సాంగ్ చేసి బాలీవుడ్‌కి అడుగుపెట్టారు. 2002లో 'సోచ్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 16 డిసెంబర్, పహేలీ, దే దనా దన్ వంటి సినిమాల్లో నటించారు. టీవీ రంగంలోనూ బిగ్ బాస్ 3 (హిందీ), ఖత్రోన్ కే ఖిలాడి లలో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2001లో మిసెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుని, ఆ కిరీటాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.

Pawan Kalyan s Thammudu Actress Aditi Govitrikar Shares Childhood Trauma and Safety Issues

ఇండస్ట్రీలో గుర్తింపు రాలేదన్న వేదన
ఇటీవలి ఇంటర్వ్యూలో అదితి తన కెరీర్‌పై ఉన్న ఒక నిరాశను కూడా బయటపెట్టారు. 2001లో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు గెలుచుకున్నలారా దత్తా, ప్రియాంక చోప్రాలకు వచ్చిన స్థాయి గుర్తింపు, అవకాశాలు తనకు రాలేదని చెప్పారు. 'అది నా మనసుకు చాలా బాధ కలిగించింది' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

'మా నాన్న స్నేహితుడే అలా'
షాకింగ్‌ విషయం ఏమిటంటే.. తాను ఆరు లేదా ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు, తన తండ్రి స్నేహితుడే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అదితి వెల్లడించారు. ఆ ఘటనను అర్థం చేసుకోవడానికి, దాని నుంచి బయటపడేందుకు తనకు చాలా సమయం పట్టిందని చెప్పారు. చదువు కోసం ముంబై వెళ్లిన తర్వాత కూడా అమ్మాయిగా భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యాయని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అనుచిత ఘటనలు తనను కలచివేశాయని తెలిపారు.

ఆ రోజుల్లో తాను ఎలా రక్షించుకున్నానో వివరిస్తూ..'నా దగ్గర రెండు పెద్ద బ్యాగులు ఉండేవి. లోపల హార్డ్‌బోర్డ్ పుస్తకాలు పెట్టుకుని, వాటిని కవచంలా పట్టుకునేదాన్ని. సీటు దొరికితే, రెండు వైపులా బ్యాగులు పెట్టుకుని ఎవరూ నన్ను తాకకుండా చూసుకునేదాన్ని' అని చెప్పారు. చిన్న వయసులోనే స్వీయరక్షణ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చిందన్నారు.

అలాగే.. ఆ తర్వాత చదువు కోసం ముంబైకి వెళ్లిన సమయంలో కూడా, ఒక అమ్మాయిగా భద్రత తనకు పెద్ద సవాలుగానే మారిందని అదితి తెలిపారు. ఇంటర్‌మెడియట్ (12వ తరగతి) చదువుతున్న రోజుల్లో క్లాసుల కోసం రోజూ దాదర్‌కు వెళ్లాల్సి వచ్చేదని, ఆ సమయంలో లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు భయపడడంతో బస్సులనే ఆశ్రయించేదాన్నని చెప్పారు.

'అమ్మాయిగా బయట ప్రపంచాన్ని ఎదుర్కోవడం నాకు చాలా త్వరగా నేర్పించబడింది. బస్సుల్లో, రద్దీ ప్రదేశాల్లో ప్రయాణాలు ఎన్నో కఠిన అనుభవాలను ఎదుర్కొన్న అని తెలిపారు. ప్రజా రవాణా అనేది కేవలం ప్రయాణం కాదు.. అది మనకు ఎలా బ్రతకాలో నేర్పించింది' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అదితి గోవిత్రికర్ చేసిన కామెంట్స్ మహిళల భద్రత, చిన్నారులపై వేధింపులు ఎంత లోతైన గాయాలను మిగుల్చుతాయో మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X