9 ఏళ్లుగా శృంగారం చేయలేదు.. ఆ వ్యక్తితో పడకగదిలో అలా ట్రై చేశా కానీ.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉంటే ఆమె అక్కడ ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ దగ్గరనుంచి తన ప్రియుడు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మోసం చేసిన విషయం వరకు ఏదైనా నిర్మోహమాటంగా మీడియా ముందు చెప్పుకొచ్చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని పాయల్ ఘోష్ కేసు పెట్టినప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది. అతను తనను రేప్ చేయబోయాడని తెలిపి షాక్ ఇచ్చింది. సినిమా చేయకముందే అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చి బాలీవుడ్ సెన్సేషన్ గా మారింది.
ఇక దీని తరువాత మహ్మద్ షమీని పెళ్లి చేసుకుంటానంటూ వన్డే ప్రపంచకప్ సందర్భంగా ప్రకటించి మీడియాలో నివలవడంతో మరోసారి అమ్మడు ఫేమస్ అయ్యింది. తెలుగువారికి ఈ చిన్నది కొత్తేమి కాదు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాలోతమన్నా ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ.. అమ్మడిని మాత్రం తెలుగు ప్రేక్షకులు ఆమెను గుర్తుపెట్టుకున్నారు.

ఆమె కెరీర్ లో కేవలం 20 సినిమాలకన్నా ఎక్కువ చేయలేదు. దానికి కారణం కూడా పాయల్ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ. అవకాశం అని పిలిచి పక్కలో పడుకుంటే కానీ ఇవ్వం అని చెప్పేస్తారు. అలాంటివాటికి ఒప్పుకొని ఉంటే ఈపాటికి నేను వంద సినిమాలు చేసేదాన్ని. అలాంటివాటికి కట్టుబడలేదు కాబట్టి.. ఇంకా ఇలా ఉన్నా అని చెప్పుకొచ్చింది.
ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క ఇలాంటి వివాదస్పదమైన కామెంట్స్ తో సోషల్ మీడియాను హీట్ ఎక్కించడం పాయల్ కు అలవాటుగా మారింది. మొన్నటికి మొన్న క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో డేటింగ్ లో ఉన్నట్లు తెలపడమే కాకుండా అతని ఫ్రెండ్ గౌతం గంభీర్ కూడా తనకు రెగ్యులర్‌గా మిస్‌డ్ కాల్స్ ఇచ్చేవాడంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇర్ఫాన్ తో డేటింగ్ లో ఉన్నా కాబట్టి తానేమి వీటిని సీరియస్ గా తీసుకోలేదని చెప్పి.. తనను తాను ఒక గొప్ప ప్రేమికురాలిగా చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి ఆమె ఇర్ఫాన్ తో డేటింగ్ గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అయితే ఈసారి మరింత ఘాటుగా రాసుకొచ్చింది.
" ఇర్ఫాన్ కన్నా నాకు చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉంటే ఏంటి? ప్రేమ ఉండాలి కదా? నా తండ్రికి మా రిలేషన్ ఇష్టంలేకపోయినా.. నేనెప్పుడు చీట్ చేయాలనుకోలేదు. నా తండ్రికి ముస్లిమ్స్ ఇష్టం లేదు. కానీ, నేను ఎప్పుడు అతనికి సపోర్ట్ గా ఉండేదాని.. కానీ,చివరకు నాకు ఏం తిరిగివచ్చింది. 2016 ను నేను, ఇర్ఫాన్ ఇంట్లో వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకొని వెంటనే ముంబైలోని ఇంటికి వచ్చాను.వచ్చి రాగానే ఇర్ఫాన్ కాల్ చేసి.. నా తల్లిదండ్రులకు నువ్వు నచ్చలేదు. మన పెళ్ళికి వారు ఒప్పుకోలేదు అని చెప్పాడు. అప్పటినుంచి నన్ను దూరం పెట్టాడు.
కొన్నిరోజుల తరువాత వాళ్ళ చెల్లి నాకు కాల్ చేసి ఇర్ఫాన్ కు పెళ్లి అయ్యింది అని చెప్పింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది.. ? నా హృదయం ముక్కలయింది.. ? నా బాధ ఎవరు అర్ధం చేసుకోలేరు. అది జరిగి ఇప్పటికి 9 ఏళ్లు అవుతుంది.. ఇప్పటివరకు నేను మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొనలేదు. ఇది వినడానికి నిజం కాకపోవచ్చు అనిపిస్తుంది. కానీ, ఇదే నిజం. ఆ తర్వాత నాతో ఒక వ్యక్తితో శృంగారం చేయడానికి ట్రై చేశారు. కానీ దాని పట్ల ఒక గౌరవం ఉంది. ఎవరితో పడితే వాళ్లతో పాల్గొనలేం కదా" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











