వాటిని గుడ్డిగా నమ్మి అడ్డంగా బుక్కైంది.. నెటిజన్ల ట్వీట్లతో ఎన్టీఆర్ భామకు కనువిప్పు
పాయల్ ఘోష్ గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరా చోప్రాకు మధ్య జరిగిన ట్విట్టర్ వార్‌లో పాయల్ ఎంటరైంది. ఎన్టీఆర్‌ను, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఆకాశానికెత్తేసింది. ఇక అప్పటి నుంచి పాయల్‌కు సోషల్ మీడియాలో మద్దతు విపరీతంగా పెరిగింది. మళ్లీ సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటనపై స్పందించి.. బాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడాను వివరించి మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ అమ్మడు తప్పులో కాలేసింది. అదేంటో ఓసారి చూద్దాం.

RRRపై రూమర్స్..
ఆర్ఆర్ఆర్ సినిమాపై ఓ వెబ్ సైట్ తప్పుడు కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను పర్సనల్ యాప్‌లో విడుదల చేస్తారని, ఒక్కసారి చూడటానికి రూ. 500 గా రేటును ఫిక్స్ చేస్తాడని ఆ రూమర్స్ సారాంశం. 8 భాషల్లో ఇలా రిలీజ్ చేస్తే రాజమౌళి అకౌంట్‌లో ఐదు గంటల్లోనే రూ. 1200 కోట్లు పడతాయని చెప్పుకొచ్చింది సదరు వెబ్ సైట్. అయితే వీటిని పాయల్ ఘోష్ గుడ్డిగా నమ్మింది.

రాజమౌళికి విన్నపం..
ఆ వార్తలను నమ్మిన పాయల్.. ఏకంగా రాజమౌళికే రిక్వెస్ట్ పంపింది. అయితే అందులోనే రాజమౌళి ట్విట్టర్ అకౌంట్‌ను తప్పుగా పేర్కొంది. ఆర్ఆర్ఆర్ సినిమా అనేది బిగ్ స్క్రీన్‌పై చూస్తేనే దాన్ని ఫీల్ అవుతామని, దయచేసి ఓటీటీలో రిలీజ్ చేయకండని రాజమౌళిని వేడుకుంది.

నెటిజన్స్ ఫైర్..
ఇక పాయల్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. పాయల్ అమాయకత్వానికి కొందరు నవ్వుకోగా.. ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రూమర్లను ఎలా నమ్ముతారు.. ఎలా ట్వీట్ చేస్తారని ఫైర్ అవుతున్నారు. దెబ్బకు పాయల్ స్పందించి.. ఆ వార్త ఎక్కడ చూసిందో చెప్పుకొచ్చింది.
Recommended Video

ఇక్కడే చదివాను..
అలా పాయల్ ట్వీట్ చేసిన కొద్ది సేపటికి మరో ట్వీట్ చేసింది. ఆర్ఆర్ఆర్ వార్తను ఇక్కడే చదివానని, సదరు వెబ్ సైట్ వార్తను కూడా షేర్ చేసింది. అయితే పాయల్ చేష్టలకు నెటిజన్లు నవ్వుకున్నారు. పొద్దుపొద్దున్నే ఈ జోకులు ఏంటి? కనీసం రాజమౌళి ట్విట్టర్ అకౌంట్ తెలీదా? అంత భారీ బడ్జెట్ చిత్రం ఓటీటీలోఎలా రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పాయల్‌కు కనువిప్పు కలిగినట్టైంది.


Click it and Unblock the Notifications











