తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది.. యంగ్ హీరోయిన్ మనసులో మాట!
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటుంది ఓ యంగ్ హీరోయిన్. అయితే.. తెలుగు ఇండస్ట్రీ తనకు ఎంతో ప్రేమ ఇచ్చిందని చెప్పిన ఆమె.. భవిష్యత్తులో అవకాశం వస్తే తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటూ ఓపెన్‌గా చెప్పేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు అలాంటి కామెంట్స్ చేసింది?
ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు.. పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టి వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో పాయల్ రాధాకృష్ణ ఒకరు. తక్కువ సమయంలోనే తన గ్లామర్, నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ. 'ప్రసన్న వదనం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాధాకృష్ణ, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో తన అందం, సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె తర్వాత వచ్చిన 'అలా చేరి', 'చౌర్యపాఠం' వంటి చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకుంది.

ఇప్పుడు వరుస తెలుగు సినిమాలతో టాలీవుడ్‌లో మారుతున్న ఈ హీరోయిన్, తన పూర్తి ఫోకస్ పెట్టినట్లు కనిపించింది. ప్రస్తుతం పాయల్ నటిస్తున్న తాజా చిత్రం Mr. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇందులో హీరో త్రిగుణంతో కలిసి ఆమె జోడీ కట్టింది. దర్శకుడు మధుదీప్ చెలికాని తెరకెక్కిస్తున్న ఈ ఫ్యాన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండ్యం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడ్డ మేకర్స్ ప్రకటించారు.
ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న పాయల్ రాధాకృష్ణ తన మనసులోని భావాలను చాలా ఓపెన్‌గా పంచుకుంది. వరుసగా తెలుగు సినిమాల్లో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని, తాను ఇప్పుడు పూర్తిగా తెలుగు ఇండస్ట్రీతో కలిసిపోయానని చెప్పుకొచ్చింది. "మొదట్లో నాకు అసలు తెలుగు రాదు. కేవలం డబ్బింగ్ కోసమే తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు తెలుగు భాషతో పాటు తెలుగు ప్రజలతో కూడా పర్సనల్‌గా కనెక్ట్ అయిపోయాను" అని చెప్పింది.
అంతేకాదు, "ఇలా వరుసగా తెలుగు సినిమాలు చేస్తుంటే ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది.ఈ సమయంలో పక్కనే ఉన్న హీరో త్రిగుణ సరదాగా "ఇంకేముంది.. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పు" అంటూ కామెంట్ చేయగా, పాయల్ నవ్వుతూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. "ఇప్పుడే అలాంటి ఆలోచన లేదు. కానీ ఫ్యూచర్‌లో అవకాశం వస్తే నిజంగానే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటా" అంటూ ఆమె చెప్పడంతో ఈవెంట్‌లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మాత్రం భారీగా ట్రెండ్ అవుతున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. పాయల్ రాధాకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు. ప్రస్తుతం ఆమె వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్ సైన్ చేస్తతోపాటు, భాషపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోందట. ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, టాలీవుడ్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న సమాచారం.పాయల్ రాధాకృష్ణకు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్, నటన కలిసి వస్తే టాలీవుడ్‌లో మంచి స్థానం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా "ఫ్యూచర్‌లో అవకాశం వస్తే తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటా" అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications




