కొత్త ప్రాజెక్ట్ కోసం అది తప్పడం లేదు.. పాయల్ రాజ్‌పుత్ రచ్చ

ప్రస్తుతం కరోనా కేసులు ఎంతలా పెరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమలో స్టార్స్‌కు కూడా కరోనా సోకుతోంది. ఈ క్రమంలో మళ్లీ పకడ్బంధీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నియమ నిబంధనలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాయల్ తాను చేసుకున్న కరోనా పరీక్షల గురించిచెప్పుకొచ్చింది. గత ఏడాది పాయల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చిన్న పిల్లలా అరవడం ఎంతగా ట్రోలింగ్‌కు గురైందో అందరికీ తెలిసిందే.

అలా తాను బాధపడుతుంటే ట్రోల్ చేయడం మరింతగా బాధపెట్టిందని పాయల్ ఎమోషనల్ అయింది. అయితే తాజాగా మరోసారి పాయల్‌కు కరోనా పరీక్షలు చేశారు. తన కొత్త సినిమా కోసం పాయల్ కరోనా పరీక్షలు చేసుకోవాల్సి వచ్చిందట. ఇదే విషయాన్ని చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. గత ఏడాది జరిగిన సంఘటనను కూడా గుర్తుకు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

payal Rajput About Corona test

నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.. గతేడాది ఇదే సమయంలో నా మొదటి కోవిడ్ పరీక్షలు జరిగాయి.. నా కొత్త ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే ముందే ఇలా మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది.. కచ్చితంగా పరీక్షలు చేసుకోవాల్సిందే. ఇక ఫలితం గురించి ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే పాయల్ మాత్రం తన కామెంట్ బాక్స్‌ను మూసి వేసేసుకుంది. మొత్తానికి నెగెటివిటీకి దూరంగా ఉండాలని పాయల్ గట్టిగానే ఫిక్స్ అయినట్టుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X