ఒంటరిగా ఉండేదాన్ని.. డైరెక్టర్లు వాడుకున్నారు.. వెంకటేష్ అలా: పాయల్ రాజ్‌పుత్ కామెంట్స్
RX 100 సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాలోనే తన అందాలతో రచ్చ చేసింది. ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ దెబ్బతో పాయల్‌కు టాలీవుడ్ లో సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి.
అయితే ఈ క్రమంలో పాయల్ సోకులు చూసి టెంప్ట్ అయిన కొందరు దర్శక నిర్మాతలు అప్పట్లో ఆమెను అడగకూడని కోరికలు కోరుతూ సినిమా అవకాశాలు ఎరగా వేశారనే వార్తలు వినిపించాయి. అయితే తనను కొంతమంది వాడుకున్నట్లు తాజాగా వెల్లడించి షాక్ ఇచ్చింది ఈ హాట్ బ్యూటి. పాయల్ ఏం చెప్పిందనే వివరాల్లోకి వెళితే..

2017లో: ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ న్యూ ఢిల్లీలో డిసెంబర్ 5, 1990లో జన్మించింది. చిన్న నాటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. తర్వాత తన అందచందాలతో యువతను ఆకర్షించింది. అయితే ముందుగా పలు హిందీ టెలివిజన్ సీరియల్స్ లో నటించిన ముద్దగుమ్మ పాయల్ రాజ్ పుత్ 2017లో చన్నా మేరేయాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.

ఓటీటీలోకి: చన్నా మేరేయా సినిమా తర్వాత వీరే కి వెడ్డింగ్ అనే హిందీ మూవీ, తెలుగులో RX100 సినిమాతో అడుగు పెట్టిన పాయల్ రాజ్ పుత్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. కానీ అవేవి అంతగా విజయం సాధించలేదు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్.

200 శాతం: ప్రస్తుతం ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ కిరాతక, మంగళవారం సినిమాలతో బిజీగా ఉంది. అయితే మాయా పేటిక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలు చెప్పింది పాయల్. "నేను ప్రతి సినిమాకు 200 శాతం ఎఫర్ట్స్ పెడతాను. శక్తివంచన లేకుండా నటిస్తాను. ఫలితం అనేది మన చేతుల్లో లేదు. దానికి అదృష్టం కూడా కావాలి" అని పాయల్ రాజ్ పుత్ తెలిపింది.

అనుభవం లేక: "ఆర్ఎక్స్ 100 సినిమా విజయం తర్వాత నేనొక్కదాన్నే హైదరాబాద్ లో ఉన్నా. దీంతో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుని వాడుకున్నారు. నన్ను మిస్ గైడ్ చేశారు. కొంతమంది దర్శకులు తప్పుదోవ పట్టించారు. నా ఇమేజ్ వాడుకున్నారు. అనుభవం లేకపోవడంతో అప్పుడు ఆ విషయాలు నాకు అర్థం కాలేదు. అసలు నా వెనుక ఏం జరుగుతుందో అని ఓ రకమైన డైలమా ఉండేది. ఏం చేయాలో తెలిసేది కాదు. ఇలా కొన్ని తప్పిదాలు జరిగాయి" అని పాయల్ చెప్పుకొచ్చింది.

గొప్ప అనుభూతి: "ఇప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాను. కథల ఎంపిక విషయంలో ఎలా ఉండాలి? ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవాలి? అనేది ఎక్కువగా ఆలోచించగలుగుతున్నా. అన్ని రకాలుగా కుదిరితేనే ఆ సినిమాకు సంతకం చేస్తున్నా. పరిశ్రమలో వెంకటేష్ గారు చాలా మంచి మనిషి. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది" అని పాయల్ పేర్కొంది.

బ్యాలెన్స్ చేయాలి: "సినిమా రంగంలో ఒక్కసారిగా టాప్ లోకి వెళ్తాం. అలాగే కిందకి పడిపోతాం. కానీ అన్నింటినీ తట్టుకుని నిలబడాలి. జయాపజయాల్ని బ్యాలెన్స్ చేయలగలగాలి. ప్రస్తుతం నెగెటివిటీని వదిలేసి పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నా" అని పంజాబీ భామ పాయల్ రాజ్ జీవితంలోని అనుభవాలను వెల్లడించింది.


Click it and Unblock the Notifications











