బీచ్‌లో తడిచిన బట్టల్లో పాయల్ రచ్చ: ఇది హాట్ షో కాదు అంతకు మించి!
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలా మంది హీరోయిన్లు దీని ద్వారా తమ క్రేజ్‌ను మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. సాదాసీదాగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. దీంతో మరింత ఉత్సాహంగా ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పాయల్ ఓ హాట్ ఫొటోను వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

మొదటి చిత్రంలోనే ఆ పాత్రలో
పంజాబ్‌కు చెందిన పాయల్ రాజ్‌పుత్ మాతృభాషలో పలు సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే RX100 మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర సంచలనం అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. దీంతో ఆమె పేరు అప్పట్లో మారుమ్రోగిపోయింది.

టాలీవుడ్‌లో పాయల్ ఫుల్ బిజీ
మొదటి చిత్రంతోనే ఆశించిన దాని కంటే ఎక్కువ గుర్తింపును అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాలు చేసింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లోనూ చేస్తోంది. ఇటీవలే 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లోనూ కనిపించింది.

ఏదీ వదలకుండా చేస్తోన్న భామ
అందానికి అందం.. నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు ఆదితో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమా చేస్తోంది. అలాగే, పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా ఒప్పుకుంది. ఇలా ఏదీ వదలకుండా నటిస్తోంది.

లవర్‌తో కలిసుంటూ రచ్చ చేస్తూ
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా యమ ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె తన ప్రియుడు సౌరభ్ డింగ్రాతో కలిసి ఉండడమే. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసి ఒకేచోట ఉంటున్నాడు. ఇక, ఇటీవలే 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లో సౌరభ్ హీరోగానూ నటించి తెగ సందడి చేశాడు.

అందులో మాత్రం ఫుల్ బిజీగానే
కెరీర పరంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నా.. పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతూనే ఉంది.

గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోంది
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. ఇలా ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

తడిచిన బట్టల్లో అందాల విందు
తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె తెలుపు రంగు డ్రెస్ వేసుకుని బీచ్‌లో పడుకుని ఉంది. అంతేకాదు, ఈ పిక్‌లో ఆమె తడిచిన అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఈ హాట్ పిక్ చాలా తక్కువ టైంలోనే వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











