twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #MeToo ఉద్యమం వచ్చినా... కాస్టింగ్ కౌచ్ పోలేదు: పాయల్ రాజ్‌పుత్

    |

    Recommended Video

    Payal Rajput About #Metoo Movement And Casting Couch || Filmibeat Telugu

    ఆర్‌ఎక్స్ 100 మూవీలో సూపర్ హాట్ గ్లామర్‌తో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడం ద్వారా పాపులర్ అయిన పాయల్ రాజ్‌పుత్ ఆ తర్వాత సెలక్టెడ్‌గా పాత్రలు ఎంచుకుంటూ దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె రవితేజతో 'డిస్కో రాజా', విక్టరీ వెంకటేష్‌తో 'వెంకీ మామా' చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో పాటు పాయల్ నటించిన 'RDX లవ్' విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఇందులో ఆమె ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించే అమ్మాయి పాత్రలో కనిపించనుంది.

    తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ మాట్లుడుతూ...ఈ సంవత్సరం తాను వరుస చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగుకు, అక్కడి నుంచి మరో షూటింగుకు తిరుగుతూ తీరిక లేకుండా గడుపుతోందట.

    పాయల్ రాజ్‌పుత్

    పాయల్ రాజ్‌పుత్

    "రోటీన్ పాత్రలు కాకుండా విభిన్నమైన, మంచి పాత్రలు చేయాలని ఉంది, అలాంటి వాటికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నాను. అప్పుడే ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాం, మూస పాత్రలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, అందుకే పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాను'' అని పాయల్ తెలిపారు.

    రవితేజ, వెంకటేష్‌తో

    రవితేజ, వెంకటేష్‌తో

    వెంకీ మామా'లో టీచర్‌గా నటిస్తున్నానని, ఇందులో వెంకటేష్ సరసన కనిపించబోతున్న పాయల్ చెప్పుకొచ్చారు. ఇందులో నా పాత్ర కోపం వచ్చినప్పుడల్లా హిందీ మాట్లాడుతుందని తెలిపారు. డిస్కో రాజాలో రవితేజ మాజీ ప్రియురాలిగా చెవిటి, మూగ అమ్మాయిగా పాయల్ నటిస్తోంది.

    కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో

    కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో

    దీంతో పాటు తెలుగులో పాయల్ మరో మూవీ కూడా చేస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. తమిళంలో ఉదయ నిధి స్టాలిన్‌తో ఓ చిత్రం చేస్తోంది. ఇలా విభిన్నమైన పాత్రలు చేస్తూ తన కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    సెక్సువల్ ఫేవర్ కొందరు అడిగారు

    సెక్సువల్ ఫేవర్ కొందరు అడిగారు

    ఈ సందర్బంగా కాస్టింగ్ కౌచ్, #MeToo ఉద్యమం గురించి కూడా పాయల్ రియాక్ట్ అయ్యారు. ఆక్స్ 100 విడుదలైన తర్వాత తన వద్దకు చాలా ఆఫర్లు వచ్చాయని, అందులో కొందరు సెక్సువల్ ఫేవర్ కోరిన వారు కూడా ఉన్నారని తెలిపారు. లైంగిక సుఖం అందిస్తే పెద్ద సినిమాల్లో మంచి రోల్ ఇప్పిస్తామని తన వద్దకు కొందరు వచ్చినట్లు పాయల్ తెలిపారు. అవకాశాల కోసం తాను అలాంటివి చేయను అని వారిని వెనక్కి పంపిందట.

    #MeToo ఉద్యమం ఉన్నప్పటికీ కాస్టింగ్ కౌచ్ పోలేదు

    #MeToo ఉద్యమం ఉన్నప్పటికీ కాస్టింగ్ కౌచ్ పోలేదు

    అవకాశాల కోసం లైంగికంగా లొంగిపోవడం లాంటి వాటిని నేను పూర్తిగా వ్యతిరేకం. ఇటువంటివి కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు అన్ని రంగంల్లో ఉన్నాయి. #MeToo ఉద్యమం ఉన్నప్పటికీ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఇప్పటికీ ఉంది అని పాయల్ స్పష్టం చేశారు.

    English summary
    "I have always been against Casting couch. Such incidents happen everywhere, and in every profession, not just in showbiz. Despite #MeToo movement, the problem still exists." Payal Rajput said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X