For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Payal Rajput శుభవార్త చెప్పిన పాయల్: లవర్‌తో కోసం ఊహించని విధంగా.. వీడియోతో మేటర్ రివీల్

  |

  సినీ పరిశ్రమలో హీరోయిన్లు వరుస పెట్టి మూవీలు చేసినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేరు. కానీ, కొందరు మాత్రమే మొదటి సినిమాతోనే ఎనలేని క్రేజ్‌తో పాటు పాపులారిటీని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఫస్ట్ మూవీనే బోల్డ్ కంటెంట్‌తో చేయడంతో ఈమె తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అలాగే వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. అదే సమయంలో తన ప్రియుడితోనూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన లవర్ గురించి శుభవార్తను చెప్పింది పాయల్. ఆ సంగతులు మీకోసం!

  అక్కడి నుంచి ఇక్కడకు.. ఫుల్ ఫేమస్

  అక్కడి నుంచి ఇక్కడకు.. ఫుల్ ఫేమస్

  మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలో పాయల్ రాజ్‌పుత్ పంజాబీలో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అక్కడి నుంచి పలు భాషల్లో నటించింది. ఈ క్రమంలోనే ‘RX 100'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘RDX లవ్', ‘వెంకీ మామ', ‘డిస్కో రాజా' వంటి పలు సినిమాలు చేసింది. ఇలా ఆరంభంలోనే తన అందంతో పాటు నటనతో ఆకట్టుకుని సత్తా చాటింది.

   అన్నీ చేస్తోన్న బ్యూటీ.. వరుస ఆఫర్లతో

  అన్నీ చేస్తోన్న బ్యూటీ.. వరుస ఆఫర్లతో

  టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇప్పటికే పలు భారీ చిత్రాల్లో భాగమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఆది సాయి కుమార్‌తో కలిసి ‘కిరాతక' అనే సినిమాను చేస్తోంది. దీనితో పాటు పంజాబీలోనూ పలు చిత్రాలను ఒప్పుకుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లలో నటించడంతో పాటు స్పెషల్ సాంగ్స్‌ను కూడా చేస్తోంది. తద్వారా వరుస ఆఫర్లతో బిజీగా మారింది.

  ప్రియుడి గురించి లీక్.. అతడితో సందడి

  ప్రియుడి గురించి లీక్.. అతడితో సందడి

  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో పాయల్ రాజ్‌పుత్.. ప్రముఖ నటుడు, సింగర్ సౌరబ్ డింగ్రాతో ప్రేమాయణం సాగిస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. అప్పుడా వార్తలను ఖండించిన ఈ బ్యూటీ.. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా తన ప్రేమను బయట పెట్టింది. అప్పటి నుంచి అతడితో కలిసి యమ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోందీ బ్యూటీ.

   అలాంటి పనులతో హాట్ టాపిక్ అవుతూ

  అలాంటి పనులతో హాట్ టాపిక్ అవుతూ

  ప్రేమను బయట పెట్టిన తర్వాత పాయల్ రాజ్‌పుత్ ఎక్కడికి వెళ్లినా సౌరబ్ డింగ్రా కూడా అక్కడ కనిపిస్తుంటాడు. ఏ భాషలో షూటింగ్ ఉన్నా.. అక్కడకు ఆమెను తీసుకెళ్లి చిత్రీకరణ అయ్యే వరకూ ఉంటాడు. ఇలా పెళ్లికి ముందే వీళ్లిద్దరూ కలసి ఉంటున్నారు. అంతేకాదు, బెడ్‌రూంలో దిగిన పర్సనల్ ఫొటోలు, వీడియోలను సైతం ఇంటర్నెట్‌లో పెట్టేస్తూ తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు.

   హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ శుభవార్త

  హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ శుభవార్త

  కొద్ది రోజుల క్రితమే సౌరబ్ డింగ్రా తల్లి కోవిడ్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఆ సమయంలో ఈ హీరోయిన్ తన బాధనంతా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇక, ఇప్పుడు మాత్రం అతడి గురించి ఓ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అదేమిటంటే.. సౌరబ్ డింగ్రా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అవును ఈ విషయాన్నే పాయల్ అధికారికంగా ప్రకటించింది.

  Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Filmibeat Telugu
   ప్రియుడి కోసం అలా.. ఆఖరికి పట్టేశాడు

  ప్రియుడి కోసం అలా.. ఆఖరికి పట్టేశాడు

  తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సౌరబ్ డింగ్రా ఫొటోను షేర్ చేసిన పాయల్ రాజ్‌పుత్ ‘తెలుగులోకి పరిచయం అవుతున్నందుకు కంగ్రాట్స్. జీవితం ఊహించని సాహసాలతో సాగుతుంది. నువ్వు అవన్నీ దాటుకుని ముందుకు వెళ్లాలి' అంటూ రాసుకొచ్చింది. ఇక, అతడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం వెనుక పాయల్ చేసిన కృషి ఎంతో ఉందని, అందుకే ఇప్పుడు ఛాన్స్ పట్టేశాడని టాక్ వినిపిస్తోంది.

  English summary
  Tollywood Hot Heroine Payal Rajput Busy With Several Movies In Hand. Now her Boyfriend Saurabh Dhingra Also will be Debuting to Telugu Film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X