For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Payal Rajput : తెలుగు బిగ్ బాస్ లో హాట్ బాంబ్.. ఎట్టకేలకు అసలు విషయం బయట పెట్టేసింది!

  |

  ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ యూత్ కి హాట్ ఫేవరేట్. చేసిన మొదటి సినిమాతోనే ఈ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అయినా సరే ఎక్కడా తగ్గని ఈ భామ వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది. అయితే ఆమె బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆమె స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే

  Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Filmibeat Telugu
   తెలుగు కంటే ముందే

  తెలుగు కంటే ముందే

  ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు వారికి పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ ఆమెకు తెలుగులో ఫస్ట్ మూవీ అయినా కూడా మాత్రం బెదురు లేకుండా హీరోతో రొమాంటిక్ సీన్స్లో నటించమంటే జీవించేసింది. ఒక రేంజ్ లో అందాలు ఆరబోసి బోల్డ్ రోల్ లో నటించి మెప్పించింది.

  నిజానికి ఈ భామ తమిళంలో 2013లో పంజాబీ లో 2017లో ఎంట్రీ ఇచ్చింది. అయితే రెండు భాషల్లోనూ కలిసిరాలేదు. 2018లో వీరేకీ వెడ్డింగ్ అనే సినిమాతో హిందీలో, ఆర్ ఎక్స్ 100 సినిమా తరువాత ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత సీత సినిమాలో బుల్ రెడ్డి అనే ఐటెం సాంగ్ లో కూడా నర్తించి మెప్పించింది.

  ఇందు దెబ్బకి

  ఇందు దెబ్బకి

  ఇక హాట్ నెస్ కి తగ్గట్టు ఆమెకు మరో రెండు మూడు సినిమా అవకాశాలు దక్కాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పిన ఆర్ డి ఎక్స్ లవ్ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన వెంకీ మామ సినిమాలో ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత డిస్కో రాజా అనే సినిమా చేసినా అది పెద్దగా పేరు తీసుకు రాలేదు. ఇక ఆహా కోసం అనగనగా ఒక అతిథి అనే సినిమా చేయగా ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కోసం

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కోసం

  ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈసారి మొదలు కానున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కోసం కొంచెం పేరున్న సెలబ్రేటీలను దింపుతున్నారని ప్రచారం మొదలయింది. పాయల్ రాజ్ పుత్ ను ఫిక్స్ చేశారని, నిర్వాహకులు ఆమెను సంప్రదించినా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం మొదలయింది.

  రచ్చ మొదలవడంతో

  రచ్చ మొదలవడంతో

  అయితే ఎట్టకేలకు ఈ విషయం మీద పాయల్ రాజ్ పుత్ స్పందించింది. తాను తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనడం లేదని, పాల్గొంటున్నాను అంటూ వస్తున్న వార్తలు అన్నీ ఫేక్ న్యూస్ అని ఆమె క్లారిటీ ఇచ్చింది. అంతేకాక ఇక అందరినీ ఇలాంటి వార్తలను పుట్టించొద్దు అని తాను విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆమె పెట్టిన పోస్ట్ కింద ఆమె అభిమానులు కచ్చితంగా ఇలాంటి షోస్ లో మీరు పాల్గొనవద్దని పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.

  ఆ తమిళ సినిమాతో బిజీ

  ఆ తమిళ సినిమాతో బిజీ

  ఇక ప్రస్తుతానికి ఆమె తమిళంలో ఏంజెల్ అనే సినిమా చేస్తోంది. చివరిగా ఆహాలో రిలీజ్ అయిన అనగనగా ఓ అతిధి అనే సినిమాలో మల్లికా పాత్రలో నటించి మెప్పించింది. అన్నట్టు ఈ భామ గత బిగ్ బాస్ సీజన్ అయిన 4వ సీజన్ ఫినాలేలో పాల్గొని మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. కానీ షోలో పాల్గొనేది లేదంటూ కొద్దిసేపటి క్రితం క్లారిటీ ఇచ్చింది.

  English summary
  actress Payal rajput gave her clarity on entry in telugu bigg boss 5. ''I’m not going to be a part of Big boss 5 telugu . It’s a fake news .. it’s a humble request plz don’t drag such rumours! #bigbosstelugu5'' she stated in her social media handles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X