Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
అమ్మను అడిగాకే అలా తయారయ్యా.. బట్టలు మొదలుకొని అన్నీ ఆమెనే.. పాయల్ రాజ్‌పుత్
Rx 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే యువత మనసు దోచుకున్న ఆమె ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ అందరికీ దగ్గరైంది. మొన్నటికి మొన్న వెంకటేష్‌తో జోడీ కట్టి వెంకీమామ రూపంలో సూపర్ హిట్ సాధించిన పాయల్.. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.
పాయల్ సహా మరో ఇద్దరు అందాల భామలు
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కో రాజా సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్ సహా నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. చిత్రంలో పాయల్ గెటప్, నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సందర్బంగా కాసేపు మీడియాతో మాట్లాడిన పాయల్ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.
నా పాత్ర నిడివి అంత మాత్రమే అయినా..
2020 సంవత్సరం చాలా అద్భుతంగా ప్రారంభమైంది. మా ‘డిస్కోరాజా'కు మంచి స్పందన లభిస్తోంది. నా పాత్ర నిడివి పెద్దది కాకపోయినా సినిమాలో దాని ప్రభావం బాగుందని అభినందనలు వస్తున్నాయి. దర్శకుడు వీఐ ఆనంద్‌గారు కథ చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించి వెంటనే ఓకే చెప్పేశా. నా పాత్ర నిడివి గురించి పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పింది పాయల్.
మూగ, చెవిటి అమ్మాయి.. ఛాలెంజింగ్ రోల్
సినిమాలో తాను మూగ, చెవిటి అమ్మాయిగా నటించానని.. ఏదైనా విషయాన్ని మాటల్లో అర్థం అయ్యేలా చెప్పేయొచ్చు.. కానీ తన పాత్ర ప్రకారం ఏదైనా కళ్లతోనే చెప్పాలి. మాట్లాడకుండా భావాన్ని వ్యక్తపరచడం చాలా కష్టంగా అనిపించిందని పాయల్ చెప్పింది. ఈ పాత్ర చేయడం తనకు చాలెంజింగ్‌గా అనిపించిందని ఆమె పేర్కొంది.
అమ్మ దగ్గర సలహాలు.. చివరకు అలా
కథానుసారం పాయల్ పాత్ర రెట్రో లుక్‌లో ఉంటుంది. అయితే ఆ పాత్రకు తయారవడం కోసం వాళ్ళ అమ్మ దగ్గర చాలా సలహాలు తీసుకుందట పాయల్. అప్పట్లో డ్రెస్సింగ్ స్టయిల్ ఎలా ఉండేది? ఎలాంటి బట్టలు వేసుకునేవారని అడిగి తెలుసుకున్నానని పాయల్ చెప్పింది. తన పాత్రను బాలీవుడ్ హీరోయిన్లు హెలెన్, హేమ మాలినీ, టబు, జీనత్ పాత్రల ఆధారంగా డిజైన్ చేశారని ఆమె తెలిపింది.
Recommended Video
అదే నా కెరీర్లో చాలా స్పెషల్
‘Rx 100' తన కెరీర్లో చాలా స్పెషల్ అని చెప్పింది పాయల్. ఆ సినిమానే తనకు తీరిక లేకుండా పని చేసేలా చేసిందని, ఆ సినిమా ద్వారా తనకు మాస్ ఫాలోయింగ్ వచ్చిందని తెలిపింది. ఈ మధ్యే ‘వెంకీ మామ'తో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యానని చెబుతూ.. ఇలా ప్రతి సినిమాకు ఆడియన్స్‌ను పెంచుకుంటూ వెళ్లాలనుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది.