నమ్మలేకపోతున్నా.. ఓ సారి గిల్లండంటూ పాయల్ కామెంట్స్
ఆర్‌ఎక్స్ 100 లాంటి చిత్రంతో ఒక్కసారిగా పాపురల్ అయిన పాయల్ రాజ్‌పుత్.. యూత్‌లో కాకపుట్టించింది. ఇందు పాత్రలో జీవించిన పాయల్.. అందచందాలతో ఆకట్టుకుంది. అయితే బోల్డ్ పాత్రలకు తాను దూరమని, కథ డిమాండ్ చేస్తేనే అలాంటి సీన్లకు ఓకే చేస్తానని చెప్పిన పాయల్.. ఆర్డీఎక్స్ లవ్ అనే చిత్రంతో పలకరించింది.
పాయల్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉండగా.. స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సరసన వెంకీమామ చేస్తుండగా.. రవితేజతో డిస్కో రాజా చిత్రంలో నటిస్తోంది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుని స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రావడంతో ఆనందంలో మునిగిపోతోన్న పాయల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

ఇది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను.. వెంకటేష్ లాంటి హీరోల సరసన నటిస్తున్నాను.. నా కల నిజమైనట్లు అనిపిస్తుంది.. ఇదంతా కలల ఉంది.. నన్ను గిల్లండి అంటూ చెప్పుకొచ్చిందట. రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను రీల్ లైఫ్‌లోనూ వెంకటేష్, నాగ చైతన్య పోషిస్తుండగా..పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











