ఒక్కక్షణం ఆశ్చర్యపోయా.. నమ్రత శిరోద్కర్‌తో పోల్చుకున్న పాయల్ రాజ్‌పుత్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ఒక్క సినిమాతో టాలీవుడ్‌ను తన వైపుకు తిప్పుకుంది. ఇందు పాత్రలో పాయల్ రాజ్‌పుత్ తన విశ్వరూపాన్ని చూపెట్టింది. బోల్డ్ పాత్రలో కనిపించి అందర్నీ కట్టిపడేసింది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను కొట్టేసింది. ఏకంగా రవితేజ, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన నటించే ఛాన్స్ దొరికింది. అయితే అవేవీ పాయల్‌కు కలిసి రాలేదు.
ఆర్ ఎక్స్ 100 మినహా పాయల్‌కు చెప్పుకోదగ్గ ఒక్క చిత్రం కూడా పడలేదు. వెంకీ మామ హిట్ అయినా.. ఆమె పాత్రకు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. డిస్కోరాజాలో మంచి పాత్రే దక్కినా.. సినిమా ఫ్లాప్ అయింది. ఇలా పాయల్‌కు ఏ ఒక్కటి కలిసి రాలేదు. ఇక ఇదంతా కాదని సోషల్ మీడియాను నమ్ముకుంది ఈ భామ. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెను పిండేస్తోంది.

లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నారు. భాగంగా పాయల్ మరింత డిఫరెంట్‌గా ఆలోచించి పిల్లో ఛాలెంజ్‌ను స్వీకరించింది. నగ్నంగా ఉండి కేవలం అందాలకు పిల్లో(దిండు)ను మాత్రమే అడ్డు పెట్టిన పాయల్ ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా పాయల్ తనను తాను నమ్రతా శిరోద్కర్‌తో పోల్చుకుంది. నమ్రత పాత సినిమాలోని ఓ స్టిల్‌ను షేర్ చేస్తూ.. ఒక్కసారి చూసి ఆశ్చర్యపోయా.. అది నేనేమో అనుకున్నా కానీ తను నా ఫేవరేట్ అయిన నమత్ర శిరోద్కర్ అంటూ చెప్పుకొచ్చింది.
namrata shirodkar pillow challenge payal rajput coronavirus lock down నమ్రత శిరోద్కర్ పాయల్ రాజ్ పుత్ పిల్లో ఛాలెంజ్ కరోనా వైరస్ లాక్ డౌన్


Click it and Unblock the Notifications