twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వార్తలన్నీ ఫేక్.. పాయల్ రాజ్‌పుత్ అసహనం

    |

    పాయల్ రాజ్‌పుత్ ఈ పేరు తెలుగు నాట ఓ సంచలనం. ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందు పాత్రలో జీవించి ఇక్కడి యూత్‌ను ఫిదా చేసింది. అయితే ఆపై ఏ ఒక్క చిత్రం కూడా ఆ స్థాయిలో హిట్ కాకపోవడం, మరోసారి ఆ రేంజ్ క్యారెక్టర్ పడకపోవడం ఆమె దురదృష్టం. ఆర్డీఎక్స్ లవ్, డిస్కోరాజా, వెంకీమామ చిత్రాలేవీ పాయల్‌కు కలిసి రాలేవు. హిట్ అయినా సరే పాయల్ అకౌంట్‌లోకి క్రెడిట్ మాత్రం రాలేదు.

    అయినా గానీ పాయల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో చేసే సందడే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోలతో నానా రచ్చ చేస్తూ ఉంటుంది. అందుకే తెరమీద కంటే పాయల్‌కు సోషల్ మీడియాలోనే క్రేజ్ ఎక్కువ. అయితే కొన్ని రోజులుగా పాయల్‌పై రూమర్స్ ఎక్కువయ్యాయి. పుష్ఫ, ఇండియన్ 2 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తోందనే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా వీటిపై పాయల్ స్పందించింది.

    Payal Rajput Condemn That Special Song In Indian 2 Movie

    'ఇలాంటి వార్తలు నామీదే ఎక్కువగా ఎందుకు వస్తాయో నాకు తెలీదు. నేను ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయడం లేదు. నన్నె ఎవ్వరూ కూడా సంప్రదించలేదు. ఇండియన్ 2, పుష్పలో ప్రత్యేక పాట చేస్తున్నానంటూ కొన్ని రోజుల నుంచి ఫోన్‌లు, మెసెజ్‌లు వస్తున్నాయి. కానీ అవన్నీ రూమర్స్. నేను వేటిపైనా సైన్ చేయలేదు. ఇప్పుడైతే నేను షూటింగ్‌లు చేయకుండా హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాను. ఇలాంటి రూమర్స్‌ను వ్యాప్తి చేయకండి.

    Payal Rajput Condemn That Special Song In Indian 2 Movie

    నా ఫ్యాన్స్ అందరికీ తెలియజేస్తున్నా.. నేను చాలా స్క్రిప్ట్స్ వింటున్నాను. మంచి కంటెంట్ ఉన్న కథలు చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ప్రాజెక్ట్‌లు సెట్ అయితే.. నేను ప్రకటిస్తాను. చివరగా.. నా తెలుగు, పంజాబీ అభిమానులు ఎంతగానో మిస్ అవుతున్నాను' అని పాయల్ చెప్పుకొచ్చింది.

    English summary
    Payal Rajput Condemn That Special Song In India 2 Movie. she says that she has been never approached by any one for That Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X