నాలుగు నెలల తరువాత ఆ పని.. సంతోషంలో మునిగిన పాయల్

పాయల్ రాజ్ పుత్ పేరు వినని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ఇందు పాత్రలో పాయల్ నటించిన తీరుకు తెలుగు యువత ఫిదా అయింది. అందాలను విచ్చలవిడిగా ఆరబోసి.. యూత్‌ను ఆకట్టుకుంది. అయితే ఆపై చేసిన సినిమాలు మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ఆర్డీఎక్స్ లవ్, డిస్కోరాజా, వెంకీ మామ వంటి చిత్రాలు పాయల్‌కు పేరు తీసుకురాలేకపోయాయి.

మామూలుగా అయితే పాయల్ వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాల్సింది. కానీ కరోనా వచ్చి పరిస్థితులను తారుమారు చేసింది. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అవ్వడంతో సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. గడిచిన లాక్ డౌన్ సమయంలో పాయల్ ఇంటి పట్టునే ఉంటూ నెటిజన్లను, ఫ్యాన్స్‌ను ఏ విధంగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లో, పేపర్ అంటూ ఏదేదో వింత వింత ఛాలెంజ్‌లతో నానా హంగామా చేసింది.

 Payal Rajput Felt Happy For Facing Camera After 4 Months

లాక్ డౌన్ సమయంలోనే పాయల్ సినిమాల గురించి ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి. పుష్ప, ఇండియన్ 2 వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో నర్తించబోతోందని వార్తలు గుప్పుమన్నాయి. అలాంటి వాటిపై పాయల్ సీరియస్ అయింది. అవన్నీ రూమర్లనేనని ఖండించింది. చాలా స్క్రిప్ట్స్ వింటున్నానని, మంచి కంటెంట్ ఉన్న కథలు చేయాలని అనుకుంటున్నానని తెలిపింది.

 Payal Rajput Felt Happy For Facing Camera After 4 Months

ఒకవేళ ప్రాజెక్ట్‌లు సెట్ అయితే.. ప్రకటిస్తానని అంటూ రూమర్లకు అడ్డుకట్ట వేసింది. అయితే దాదాపు నాలుగు నెలల సుధీర్ఘ సమయం తరువాత ఓ పంజాబీ పాట కోసం కెమెరా ముందుకు వచ్చిందట. ఇంత గ్యాప్ తరువాత కెమెరా ముందుకు రావడంతో పట్టరాని సంతోషం కలిగిందని పాయల్ తెలిపింది. త్వరలోనే ఆ పంజాబీ సాంగ్ రిలీజ్ కానుందని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X