RX 100కి సీక్వెల్ కాదు.. క్లారిటీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్!
RX 100 చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంతో పాయల్ రాజ్‌పుత్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం పాయల్ టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. RX 100 చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్రాళ్ల హృదయాల్లో అలజడి సృష్టించిన పాయల్ రాజ్ పుత్ తన తదుపరి చిత్రాలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ భాను శంకర్ దర్శకత్వంలో 'RDX లవ్' అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రం RX 100 కి సీక్వెల్ అంటూ జరుగుతున్న ప్రచారంపై పాయల్ రాజ్ పుత్ తాజాగా స్పందించింది. పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ RDX లవ్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ. దీనికి RX 100 చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా డిఫెరెంట్ జోనర్ లో తెరకెక్కుతోందని పాయల్ రాజ్ పుత్ క్లారిటీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే రొమాన్స్ లో రెంచిపోయిన ఈ పంజాబీ భామకు క్రేజీ చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా వెంకీ మామ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ వెంకటేష్ కు హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు రవితేజ డిస్కో రాజాలో కూడా పాయల్ హీరోయిన్ గా ఎంపికైంది.


Click it and Unblock the Notifications











