బాయ్ ఫ్రెండ్‌తో పాయల్ రాజ్ పుత్ రొమాంటిక్‌గా.. చూపించని అందాలతో బర్త్ డే గిఫ్ట్!

మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు పొందే హీరోయిన్లు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటివారిలో హాట్ బ్యూటి పాయల్ రాజ్ పుత్ ఒకరు. చన్నా మేరేయా అనే పంజాబీ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాయల్​ రాజ్​పుత్ తెలుగులో ఆర్​ఎక్స్​ 100 సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో తన హాట్ నెస్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది.

ఒక్కసారిగా టాలీవుడ్​లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అయితే తర్వాత చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం పాయల్ రాజ్ పుత్ హైరేంజ్ లో రెచ్చిపోతూ ఉంటోంది. ఈ క్రమంలోనే బాయ్ ఫ్రెండ్ తో బట్టలు లేకుండా సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది.

పాయల్ సోకులు చూసి..

పాయల్ సోకులు చూసి..

RX 100 సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాలోనే తన అందాలతో రచ్చ చేసింది. ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ దెబ్బతో పాయల్‌కు టాలీవుడ్ లో సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఈ క్రమంలో పాయల్ సోకులు చూసి టెంప్ట్ అయిన కొందరు దర్శక నిర్మాతలు అప్పట్లో ఆమెను అడకూడని కోరికలు అడుగుతూ సినిమా అవకాశాలు ఎవరగా వేశారనే వార్తలు వినిపించాయి. అలాంటి వాటికి లొంగకుండా మంచి కథల కోసం ఎదురు చూసింది ఈ ముద్దుగుమ్మ.

హిందీ టెలివిజన్ సీరియల్స్ లో..

హిందీ టెలివిజన్ సీరియల్స్ లో..

పంజాబీ సినిమాతో సిన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. న్యూ ఢిల్లీలో డిసెంబర్ 5, 1990లో జన్మించింది. చిన్న నాటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ముందుగా పలు హిందీ టెలివిజన్ సీరియల్స్ లో నటించిన పాయల్ రాజ్ పుత్ 2017లో చన్నా మేరేయా అనే పంజాబీ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేసింది ఈ భామ.

వరుస చిత్రాలతో బిజీగా..

వరుస చిత్రాలతో బిజీగా..

తెలుగులో 2018లో RX100 సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఫలితంగా ఆరంభంలోనే ఈ భామ ఫుల్ పాపులర్ అయింది. తెలుగులో మంచి ఆరంభాన్ని సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్‌.. ఆ తర్వాత వరుస చిత్రాలతో సందడి చేసింది. ఇలా ఈ భామ 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది.

ఆశించినంతగా లేని విజయాలు..

ఆశించినంతగా లేని విజయాలు..

పాయల్ రాజ్ పుత్ సినిమాల్లోనే కాకుండా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ అదరగొట్టింది. ముఖ్యంగా త్రీ రోజేస్ సిరీస్ లో తన హాట్ నెస్ తో మరోసారి మెస్మరైజ్ చేసింది. తెలుగులో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటోన్న పాయల్.. గతేడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. అవి అంతగా హిట్ కాలేదు.

రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతూ..

రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతూ..

తమిళంలో పాయల్ వరుసగా రెండు చిత్రాలను చేస్తోంది. ఒకవైపు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న పాయల్ రాజ్‌పుత్.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె ప్రస్తుతం సౌరభ్ డింగ్రా అనే నటుడితో ప్రేమలో ఉండడమే. అంతేకాదు, ఇద్దరూ ఒకే చోట ఉంటూ, తరచూ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతోన్నారు. ఇక, 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లో సౌరభ్ ఆమెకు జోడీగా కూడా చేశాడు.

బట్టలు లేకుండా, వైల్డ్ గా చూస్తూ..

తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ తో సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ అంతకుమించి రొమాన్స్ చేస్తుంది పాయల్ రాజ్ పుత్. నేడు సౌరభ్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. వాటిలో అతనితో ఘాటు రొమాన్స్ చేసింది. ముఖ్యంగా ఒక ఫొటోలో ఒంటిపై బట్టలు లేకుండా అతన్ని హగ్ చేసుకుని మరి ముద్దుపెట్టుకుంది ఈ హాట్ భామ. అలాగే మరో పిక్ లో అతను కిస్ చేస్తుంటే వైల్డ్ గా చూస్తూ అట్రాక్ట్ చేస్తోంది పాయల్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X